హోమ్ /వార్తలు /సినిమా /

Sameera Reddy : బేబీ బంప్‌తో స్విమ్మింగ్‌ పూల్‌లో సమీరారెడ్డి .. వైరల్ అవుతున్న ఫోటోస్ ఇవే

Sameera Reddy : బేబీ బంప్‌తో స్విమ్మింగ్‌ పూల్‌లో సమీరారెడ్డి .. వైరల్ అవుతున్న ఫోటోస్ ఇవే

(Photo Credit:Instagram)

(Photo Credit:Instagram)

Sameera Reddy: స్టోరీ పాతదైనా సినిమా స్టైల్‌గా తీస్తే హిట్ అవడం పక్కా అని హీరోయిన్ సమీరారెడ్డి నిరూపించింది. తాను సెకండ్‌ టైమ్ ప్రెగ్నెన్సీ టైమ్‌లో దిగిన ఫోటోలను ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నెటిజన్ల కళ్లను తనవైపు తిప్పుకుంటోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Mumbai, India

హీరోయిన్‌గా చేసింది తక్కువ సినిమాలే అయినా సౌత్‌(South), నార్త్‌(North)లో మంచి పేరు తెచ్చుకున్న సమీరారెడ్డి(Sameera reddy)మళ్లీ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. అయితే ఇది ఆమె సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న వార్త కాదు. అప్పుడెప్పుడో రెండో సారి ప్రెగ్నెంట్‌(Pregnant)గా ఉన్నప్పుడు దిగిన ఫోటోలను ఓ వీడియోగా రూపొందించి సోషల్ మీడియా(Social media)లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ పాత ఫోటోలే ఇంటర్‌నెట్‌ని షేక్ చేస్తున్నాయి. బేబీ బంప్‌(Baby bump)తో నీళ్లలోపల జలకాలాడుతున్న సాగర కన్యలా కలర్‌ఫుల్‌ స్విమ్ డ్రెస్సుSwim dressల్లో స్కిన్‌ షో చేస్తూ బేబీ బంప్ కనిపించేలా ఫోటోలకు ఫోజులిచ్చింది సమీరారెడ్డి. చాలా రోజుల క్రితం దిగిన ఫోటోలను ఇప్పుడు ఇన్‌స్టా(Instagram)హ్యాండిల్‌లో షేర్ చేసి సమీరారెడ్డి వీడియోకి లక్షల్లో వ్యూస్ వచ్చాయి.


Vijay Devarakonda - Liger: విజయ్ దేవరకొండ ‘లైగర్’ మూవీ ఖాతాలో మరో రికార్డు.. మిక్స్‌డ్ టాక్‌లో కూడా ఇదో అద్భుతం..


వైరల్ అవుతున్న ఫోటోలు..
పిల్లలు పుడితే గ్లామర్ తగ్గిపోతుందని అపోహ పడేవాళ్ల కోసమే సమీరారెడ్డి ఈవీడియోని అందరితో షేర్ చేసుకుంది. ఈఫోటోషూట్‌కి సంబంధించిన వీడియోని షేర్ చేసి తాను ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో తన శరీరం ఎంతో అందంగా ఉందని చూసుకొని మురిసిపోతోంది. మహిళలు తమ శరీరాన్ని చూసుకొని సిగ్గుపడకూడదని ..ఈఫోటోషూట్‌ ద్వారా కామెంట్‌ని షేర్ చేసింది. ఆల్రెడీ ఇద్దరు బిడ్డలకు తల్లిగా ఉన్న ఎక్స్‌పీయరెన్స్‌తో చెబుతుందో ఏమో సమీరారెడ్డి ఓల్డ్ ఫోటో షూట్‌కి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.


స్విమ్మింగ్‌ పూల్‌లో జలకన్య..

సహజంగా హీరోయిన్లు పెళ్లి చేసుకున్న తర్వాత, వయసు పెరిగేకొద్ది తమ పర్సనల్ విషయాల్ని అభిమానులు, నెటిజన్లతో షేర్ చేసుకోవడానికి సిగ్గుపడతారు. కాని సమీరారెడ్డి మాత్రం గతంలో తనకు తెల్ల వెంట్రుకలు వచ్చిన వీడియోని, భర్త, పిల్లలతో ఎంజాయ్ చేస్తున్న వీడియోలు, ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తున్న సమీరారెడ్డి ఇప్పుడు ఈ వీడియో షేర్ చేసి నెటిజన్ల నుంచి మరికొన్ని కాంప్లిమెంట్స్ పొందుతోంది. ఎనిమిదేళ్ల క్రితం వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్‌ని గడుపుతున్న సమీరారెడ్డి టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి , బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ , తమిళ హీరో సూర్యతో స్క్రీన్ షేర్ చేసుకుంది.


Bandla Ganesh: అన్ని పార్టీలు తిరిగిన ఆదర్శ దంపతులు.. జీవిత రాజశేఖర్‌పై బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్


సోషల్ మీడియా ఫాలోయింగ్ కోసమేనా..

గతంలో హీరోయిన్‌లు ఎవరూ తల్లులు అయిన సందర్భాన్ని ఇంతగా అందరికి చెప్పుకున్న సందర్భాలు లేవు. ఈమధ్య కాలంలో హాలీవుడ్, బాలీవుడ్ నటీమణులు బేబీ బంప్‌తో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో ..సమీరారెడ్డికి కూడా తన పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి నేను మాత్రం అప్పటి ఫోటోలు చూపించుకుంటే తప్పేంటనే ఫీలింగ్‌తోనే లేట్‌గా షేర్ చేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Sameera reddy, Tollywood actress, Viral photo

ఉత్తమ కథలు