హోమ్ /వార్తలు /సినిమా /

Sadha: థియేటర్ లోనే కన్నీళ్లు పెట్టుకున్న సదా.. అస్సలు తట్టుకోలేకపోయంటూ ఎమోషనల్

Sadha: థియేటర్ లోనే కన్నీళ్లు పెట్టుకున్న సదా.. అస్సలు తట్టుకోలేకపోయంటూ ఎమోషనల్

Photo Twitter

Photo Twitter

Major movie: మేజర్‌ మూవీ చూసి హీరోయిన్ సదా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ రోజు ముంబైలో జరిగిన సంఘటనలు ఆమె గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మేజర్‌ మూవీ చూసి హీరోయిన్ సదా (Sadha) కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ రోజు ముంబైలో జరిగిన సంఘటనలు ఆమె గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యంగ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) టైటిల్ రోల్‌ పోషిస్తూ మేజర్ (Major) రూపంలో ఓ సందేశాత్మక సినిమాను ప్రేక్షకుల ముందుంచారు. సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా‌తో పాటు GMB ఎంటర్‌టైన్‌మెంట్, A+S మూవీస్ పతాకాల సంయుక్త సమర్పణలో రూపొందిన ఈ సినిమాకు శశి కిరణ్ తిక్క (Sashi Kiran Tikka) దర్శకత్వం వహించారు. సాయి మంజ్రేకర్ (Saiee Manjrekar) హీరోయిన్‌గా నటించగా.. శోబిత ధూళిపాళ (Sobhita Dhulipala), ప్రకాష్ రాజ్ (Prakash raj), రేవతి (Revathi) తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబడిన ఈ చిత్రం నిజమైన భారతీయ హీరో అయిన మేజర్ ఉన్నికృష్ణన్ సాహసాలను కాళ్లకు కట్టినట్లు చూపించింది. తాజ్‌హోటల్‌పై దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు ఎదురొడ్డి పోరాడిన ధీరుడు మేజర్ సందీప్ కృష్ణన్. తాజాగా ఈ సినిమాను ముంబైలో థియేటర్‌లో చూసిన నటి సదా ఎమోషనల్ అయింది. థియేటర్‌లో ఈ సినిమా చూస్తుండగా ఆమె కంటి వెంట నీరు ఆగలేదు. అందరూ చూస్తుండగానే ఆమె ఏడ్చేసింది.

ఆ తర్వాత.. ముంబై దాడులు జరిగినప్పుడు తాను ఇంట్లోనే ఉన్నానని చెబుతూ ఓ వీడియో షేర్ చేసింది సదా. మేజర్ మూవీ చూస్తుంటే ఆ రోజు జరిగిన సంఘటనలు కళ్ళముందే కదలాడాయని ఆమె పేర్కొంది. ఆ రోజు జరిగినది గుర్తు చేసుకుంటుంటే బాధేస్తోందని చెప్పిన సదా.. ఈ చిత్రంలో అడివిశేష్ అద్భుతంగా న‌టించాడ‌ని తెలుపుతూ ఆయన నటనపై ప్రశంసలు కురిపించింది. చాలా కాలం తర్వాత ఓ ఎమోషనల్ మూవీ చూశానని అన్నారు సదా. డైరెక్టర్ శశికిరణ్ తిక్కా టేకింగ్ అద్భుతంగా ఉందని కొనియాడారు.

View this post on Instagram


A post shared by Major (@majorthefilm)అప్పట్లో తేజ దర్శకత్వంలో వచ్చిన జ‌యం సినిమాతో యువత మనసు దోచుకుంది సదా. ‘వెళ్ళ‌వ‌య్యా వెళ్ళు’ అంటూ ఆమె చెప్పిన డైలాగ్ ప్రేక్షకుల మదిలో అలా స్థిరపడిపోయింది. అందరికీ టైం ఫేవ‌రెట్‌గా డైలాగ్‌గా నిలిచిపోయింది. ఈ సినిమా త‌మిళ వెర్ష‌న్‌లోనూ స‌దానే హీరోయిన్‌గా న‌టించింది. ఆ తర్వాత విక్ర‌మ్‌ హీరోగా వచ్చిన అప‌రిచితుడు సినిమాతో సూపర్ క్రేజ్ అందుకున్న సదా కెరీర్ మెల్లగా డల్ అయింది. ప్రస్తుతం ఆమె ఓ తెలుగు సినిమా చేస్తోందట.

Published by:Sunil Boddula
First published:

Tags: Major Movie, Sadha, Tollywood

ఉత్తమ కథలు