అందుకు బాగా ఫీలైన రాశీఖన్నా సారీ చెప్పేసింది..

కాస్తా ఫీలైన రాశీ ఖన్నా.. అందరి పేర్లు ఉన్నందుకు హ్యాపీగా ఉంది. కానీ.. నిన్ను గుర్తించనందుకు సారీ రవీనా.. నువ్వు నీ చక్కని గొంతుని నాకు అరువిచ్చి నా క్యారెక్టర్‌ని మరింత ఎలివేట్ చేశావు.. అంటూ ట్వీట్ చేసింది. ఇలా హీరోయినే ట్వీట్ చేసేసరికి.. డబ్బింగ్ ఆర్టిస్ట్ రవీనా స్పందించింది.. ‘థ్యాంక్యూ రాశీ..

news18-telugu
Updated: May 18, 2019, 6:21 PM IST
అందుకు బాగా ఫీలైన రాశీఖన్నా సారీ చెప్పేసింది..
Video : మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటాలి : రాశి ఖన్నా
  • Share this:
రాశీఖన్నా.. ఊహలు గుసగుసలాడే మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడిప్పుడే సక్సెస్‌ ట్రాక్‌లోకి వెళ్తుంది. తమిళంలో స్టార్ హీరోల పక్కన స్క్రీన్ షేర్ చేసుకుంటూ హిట్స్‌ని తన ఖాతాలో వేసుకుంటూ దూసుకెళ్తుంది. తమిళనాట అమ్మడి క్రేజ్ ఎలా ఉందంటే.. రాశీ ఖన్నా ఉంటే సినిమా హిట్ పక్కా అనేంతగా..దీంతో ఫుల్ హ్యాపీగా ఉన్న రాశీఖన్నా తాజాగా ట్విట్టర్ వేదికగా సారీ చెప్పింది. అదీ కూడా ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్‌కి.

ఈ మధ్యకాలంలో విశాల్‌కు జోడిగ ‘అయోగ్య’ సినిమాలో నటించింది రాశీ. ఇది ఎన్టీఆర్ నటించిన బ్లాక్ ‘టెంపర్’మూవీకి రీమేక్. ఈ సినిమా అక్కడ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇందులో రాశీకి డబ్బింగ్ రవీనా అనే అమ్మాయి చెప్పింది. అయితే, ఈ సినిమా ఎండ్ టైటిల్స్‌లో డబ్బింగ్ ఆర్టిస్ట్‌లకు క్రెడిట్ ఇవ్వలేదు. అందరీ నేమ్స్ మెన్షన్ చేశారు గానీ, వారి పేర్లు వేయలేదు. దీంతో కాస్తా ఫీలైన రాశీ ఖన్నా.. అందరి పేర్లు ఉన్నందుకు హ్యాపీగా ఉంది. కానీ.. నిన్ను గుర్తించనందుకు సారీ రవీనా.. నువ్వు నీ చక్కని గొంతుని నాకు అరువిచ్చి నా క్యారెక్టర్‌ని మరింత ఎలివేట్ చేశావు.. అంటూ ట్వీట్ చేసింది. ఇలా హీరోయినే ట్వీట్ చేసేసరికి.. డబ్బింగ్ ఆర్టిస్ట్ రవీనా స్పందించింది.. ‘థ్యాంక్యూ రాశీ.. సారీ చెప్పాల్సిన అవసరంలేదు.. మీకు డబ్బింగ్ చెప్పడమే చాలా హ్యాపీగా ఉంది’అంటూ రిట్వీట్ చేశారు. ఇదంతా చూసినవారు.. అమ్మో ఓ హీరోయిన్‌కి ఇంత మంచి మనసా అంటూ సోషల్ మీడియాలో ముద్దుగుమ్మని మరింత పొగిడేస్తున్నారు.
First published: May 18, 2019, 6:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading