హోమ్ /వార్తలు /సినిమా /

Heroine Rambha : కారు యాక్సిడెంట్‌ తర్వాత ఫస్ట్ టైం వీడియోని షేర్ చేసిన నటి రంభ .. వీడియో ఇదిగో

Heroine Rambha : కారు యాక్సిడెంట్‌ తర్వాత ఫస్ట్ టైం వీడియోని షేర్ చేసిన నటి రంభ .. వీడియో ఇదిగో

(Photo Credit:Instagram)

(Photo Credit:Instagram)

Heroine Rambha: కారు ప్రమాదంలో ఆసుపత్రి పాలైన సినీ నటి రంభ అభిమానులకు కృతజ్ఞతలు చెప్పింది. రెండ్రోజుల క్రితం రోడ్డు ప్రమాదం కారణంగా ఆసుపత్రిలో చేరిన తన కూతురు కూడా డిశ్చార్జ్ అయిందని తెలిపింది. తన కోసం తన పిల్లల కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

కారు ప్రమాదంలో ఆసుపత్రి పాలైన సినీ నటి రంభ(Rambha)అభిమానులకు కృతజ్ఞతలు(Thanks)చెప్పింది. రెండ్రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన తన కారులో పిల్లలు, తాను ఆసుపత్రిలో చేరడం ప్రమాదం తప్పి సురక్షితంగా బయటపడ్డామని తెలిపింది. తన కోసం తన పిల్లల కోసం ప్రార్థించిన అభిమానులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే తమ పట్ల ప్రతి ఒక్కరూ చూపించిన ప్రేమానురాగాలు మర్చిపోలేనిదన్నారు. అంతే కాదు ఆసుపత్రిలో ఉన్న తన కుమార్తె సాషా(Sasha)కూడా డిశ్చార్జ్ (Discharge)అయినట్లుగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో తన ఫీలింగ్స్‌ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది.

Tollywood: ఇండియన్‌-2 మూవీలో స్టార్ క్రికెటర్‌ తండ్రి .. యోగరాజ్‌ సింగ్‌ క్యారెక్టర్ ఏంటో తెలుసా..?

మేమంతా క్షేమం..

ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ రంభ ప్రయాణిస్తున్న కారు రెండ్రోజుల క్రితం కెనడాలో ప్రమాదానికి గురైంది. ఈదుర్ఘటనలో కారు నుజ్జునుజ్జవగా రంభ కుమార్తె సాషా స్వల్పంగా గాయపడింది. ప్రమాదం జరిగిన వెంటనే అందర్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తాను, తన పిల్లలు క్షేమంగా ఉన్నామని తన కూతురు సాషా కూడా హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయిందని రంభ తెలిపింది. తన కారును మరో కారు వేగంగా వచ్చి ఢీకొట్టడం వల్లే ప్రమాదానికి గురైనట్లుగా తెలిపింది. తాను, తన పిల్లలు క్షేమంగా ఉండాలని ప్రార్ధించిన అభిమానులతో పాటు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెబుతూ వీడియో రిలీజ్ చేసింది.

అందరికి ధన్యవాదాలు..

ప్రమాదం జరిగిన సమయంలో తమ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసిన రంభ అందరం క్షేమంగా ఉన్నామని మొదటిసారి ఇన్‌స్టాలో లైవ్‌ ద్వారా తెలియజేశారు. మాకు ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే స్పందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు రంభ. మా పట్ల చూపించిన ప్రేమానురాగాలు ఎప్పటికి మర్చిపోలేనని చెప్పింది. ఆసుపత్రిలో ఉన్న తన కుమార్తె సాషా డిశ్చార్జ్ అయ్యిందని, ఇంటికి వచ్చిందని చెప్పింది.

Krithi Shetty: సొగసులు చూపిస్తున్న సొట్ట బుగ్గల బ్యూటీ ..కలర్‌ఫుల్‌గా ఉన్న కృతిశెట్టి లేటెస్ట్‌ పిక్స్

రంభ వీడియో మెసేజ్..

ఇంత మంది అభిమానుల్ని పొందడం అదృష్టంగా భావిస్తున్నట్లుగా రంభ తెలిపింది. తన సంతోషాన్ని పంచుకోవడానికి మాటలు కూడా రావడం లేదన్నారు. పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డామని..ఇదంతా అభిమానులు చేసిన ప్రార్ధనల ఫలితమేనని చెప్పారు. మంగళవారం రంభ తన పిల్లలను స్కూల్‌ నుంచి కారులో తీసుకొని వస్తుండగా వేరే కారు ఢికొట్టిన విషయం తెలిసిందే.

First published:

Tags: Tollywood, Tollywood actress

ఉత్తమ కథలు