తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్..

ప్రస్తుతం వెంకీ మామ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న పాయల్.. ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.

news18-telugu
Updated: December 16, 2019, 8:29 AM IST
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్..
పాయల్ రాజ్‌పుత్(File Photo)
  • Share this:
ఆర్ఎక్స్100 సినిమాతో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్.. వెంకీ మామ సినిమాతో తన ఖాతాలో మరో హిట్‌ను జమచేసుకుంది. ప్రస్తుతం సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న పాయల్.. ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. దర్శనానికి ముందు శ్రీవత్స అన్నమయ్య హోటల్లో ఆమె బస చేశారు. ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్‌ సభ్యుడు పెంచలయ్య ఆమెకు శాలువా కప్పి సన్మానించారు.

కాగా,శనివారం ఆమె తిరుపతి పట్టణంలోని హాట్‌స్పాట్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. వెంకీ మామ హిట్ టాక్ తెచ్చుకోవడం మరింత సంతోషంగా అనిపిస్తోందన్నారు. తన తదుపరి చిత్రం డిస్కో రాజా కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందన్నారు. ఈ సందర్భంగా పాయల్ రాజ్‌పుత్‌తో సెల్ఫీల కోసం పలువురు యువకులు ఎగబడ్డారు.

First published: December 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>