• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • HEROINE PAYAL RAJPUT STARTED NEW BUSINESS HERE IS FULL DETAILS MHN

Payal Rajput: పాయల్‌ రాజ్‌పుత్‌ కొత్త వ్యాపారం.. అవకాశాలు లేకపోవడమే కారణమా..!

Payal Rajput: పాయల్‌ రాజ్‌పుత్‌ కొత్త వ్యాపారం.. అవకాశాలు లేకపోవడమే కారణమా..!

పాయల్ రాజ్‌పుత్ (Instagram/Photo)

Payal Rajput - New Business: పాయల్‌ రాజ్‌పుత్‌ గుంఫీ కొత్త బిజినెస్ మొదలుపెట్టింది. సినిమాలో ఆఫర్లు తగ్గడంతోనే పాయల్ కొత్త బిజినెస్ మీద దృష్టిసారించిందని ఫిల్మ్ నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

  • Share this:
    పంజాబీ సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్‌ చేసిన పాయల్‌ రాజ్‌పుత్‌కు బ్రేక్‌ ఇచ్చింది మాత్రం తెలుగు సినీ పరిశ్రమే. 2018లో విడుదలైన 'ఆర్‌.ఎక్స్‌ 100'లో లిప్‌లాక్స్‌కు ఓకే చెప్పిన ఈ ముద్దుగుమ్మకి యూత్‌లో తిరుగులేని క్రేజ్‌ ఏర్పడింది. హాట్‌ హీరోయిన్‌గా ఇమేజ్‌ రావడంతో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. కానీ పరిమిత సంఖ్యలో సినిమాలు ఒప్పుకుంటూ వచ్చింది. 'ఆర్‌.డి.ఎక్స్‌ లవ్‌, వెంకీమామ, డిస్కోరాజా' చిత్రాలు నిరాశ పరచడంతో పాయల్ రాజ్‌పుత్‌కు అవకాశాలు తగ్గిపోయాయి. ఆమె కోసం క్యూ కట్టిన నిర్మాతలు మొహం చాటేశారు. రీసెంట్‌గా ఓటీటీలో విడుదలైన అనగనగా ఓ అతిథి సినిమా పాయల్‌కు పెద్దగా గుర్తింపును తెచ్చిపెట్టలేదు. ప్రస్తుతం తమిళంలో ఏంజెల్‌ అనే సినిమాలో మాత్రమే నటిస్తుందీ అమ్మడు. రీసెంట్‌గా రైటర్‌ అనే షార్ట్‌ ఫిల్మ్‌లోనూ నటించింది. బాయ్‌ఫ్రెండ్‌తో ఖాళీ సమయంలో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న పాయల్‌ రాజ్‌పుత్‌..కొత్త వ్యాపారాన్ని షురూ చేసింది. అయితే అవకాశాలు లేకనే పాయల్‌ కొత్త వ్యాపారంపై దృష్టి సారిస్తుందని కూడా గుసగుసలు ప్రారంభమైయ్యాయి. ఇంతకీ పాయల్‌ ఏ బిజినెస్‌ స్టార్ట్‌ చేసిందనే వివరాల్లోకెళ్తే..

    మహేశ్‌, విజయ్‌ దేవరకొండ, రకుల్‌ సహా చాలా మంది స్టార్స్ సినిమాలతో పాటు ఇతర రంగాల్లోనూ పెట్టుబడులు పెడుతున్నారు. వీరిలో ముఖ్యంగా మహేశ్‌, విజయ్‌ దేవరకొండలాంటి వారు బట్టల వ్యాపారాన్ని ప్రారంభించారు. పాయల్‌ రాజ్‌పుత్‌ కూడా రీసెంట్‌గా వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టిందట. గుంఫి పేరుతో కాస్ట్యూమ్స్‌ రంగంలోకి పాయల్ ఎంట్రీ ఇచ్చింది. తన కాస్ట్యూమ్స్‌ డిజైన్స్‌ను అందరిలోకి అందుబాటులోకి తీసుకెళ్లడానికి మార్కెటింగ్‌ చేసుకోవడానికి ఈ సొగసరి గుంఫి డాట్‌ యాప్‌ అనే.. ఓ యాప్‌ను స్టార్ట్ చేసింది పాయల్‌. ఈ యాప్‌లోకి వెళితే డిఫరెంట్ మోడల్స్‌ డ్రెస్సులుంటాయి. వాటిని సెలక్ట్‌ చేసుకుని ఆన్‌లైన్‌ పే చేస్తే చాలు. ఈ విషయాన్ని పాయల్‌ వివరిస్తూ ఓ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్నపాటి వీడియోను కూడా షేర్‌ చేసింది.








    View this post on Instagram






    A post shared by Payal Rajput (@rajputpaayal)






    తెలుగు ఇండస్ట్రీలో 'ఆర్.ఎక్స్‌ 100'తో వచ్చిన సక్సెస్‌ను పాయల్ రాజ్‌పుత్‌ అవకాశాలుగా మలుచుకోలేకపోయింది. ఈ విషయంలో ఆమె బహిరంగంగానే బాధపడుతుంటుంది. వెంకీమామలో వెంకటేశ్‌ జోడీగా నటించడం కూడా తన కెరీర్‌కు మైనస్‌గా మారిందని కూడా ఆమె అభిప్రాయపడుతుంది. మరిప్పుడు కొత్త వ్యాపారంలో పాయల్‌ ఎలా రాణిస్తుందో చూడాలి.
    Published by:Anil
    First published:

    అగ్ర కథనాలు