వర్జినిటీపై నివేదా థామస్‌కు ఫ్యాన్ ప్రశ్న.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన బ్యూటీ..

తాజాగా హీరోయిన్ నివేదా థామస్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో సరదాగా చాట్ చేసింది. చాలామంది ఫ్యాన్స్ అడిగిన సరదా ప్రశ్నలకు.. అంతే సరదాగా సమాధానం చెప్పింది. కానీ కొంతమంది ఫ్యాన్స్ వ్యక్తిగత ప్రశ్నలతో ఆమెను ఇబ్బంది పెట్టారు.

news18-telugu
Updated: November 9, 2019, 6:04 PM IST
వర్జినిటీపై నివేదా థామస్‌కు ఫ్యాన్ ప్రశ్న.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన బ్యూటీ..
నివేదా థామస్ (File Photo)
  • Share this:
ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండేందుకు సోషల్ ప్లాట్‌ఫామ్స్‌లో సెలబ్రిటీలు యాక్టివ్‌గా ఉండటం కామన్. అప్పుడప్పుడు వారితో సరదాగా చిట్‌చాట్ చేయడం కూడా కామన్. తాజాగా హీరోయిన్ నివేదా థామస్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో సరదాగా చాట్ చేసింది. చాలామంది ఫ్యాన్స్ అడిగిన సరదా ప్రశ్నలకు.. అంతే సరదాగా సమాధానం చెప్పింది. కానీ కొంతమంది ఫ్యాన్స్ వ్యక్తిగత ప్రశ్నలతో ఆమెను ఇబ్బంది పెట్టారు. 'మీకు బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారా..?' 'మీరు వర్జినేనా..?' వంటి ప్రశ్నలతో ఇబ్బందికి గురిచేశారు. ఈ విషయాన్ని నివేదా ఇన్‌స్టాగ్రామ్‌లో స్వయంగా వెల్లడించారు. అలాంటి ప్రశ్నలను పట్టించుకోలేదని చెప్పారు. అలాంటి ప్రశ్నలు అడిగేవారు తాను కూడా మనిషేనని గుర్తుంచుకోవాలని.. కాస్త గౌరవప్రదంగా మెలగాలని సూచించారు.

ఒకవేళ మీరు నటి కాకుండా ఉంటే.. ఏమయ్యేవారు అని ఓ ఫ్యాన్ ప్రశ్నించగా.. 'ఆర్కిటెక్ట్' అని చెప్పారు. కాస్టూమ్య్ విషయంలో మీకేమైనా పరిధులు ఉన్నాయా? అన్న ప్రశ్నకు.. కథ,క్యారేక్టరైజేషన్‌కు అనుగుణంగా కాస్టూమ్స్ ఉండేలా చూసుకుంటానని చెప్పారు. భవిష్యత్‌లో మిమ్మల్ని నెగటివ్ పాత్రల్లో చూసే ఛాన్స్ ఉందా? అన్న ప్రశ్నకు.. 'ఎందుకు లేదు' అని బదులిచ్చారు. ఇక మీ ఫేవరెట్ సినిమా ఏదన్న ప్రశ్నకు.. 'జోకర్' అని చెప్పారు. రజనీకాంత్‌తో చేయడం తన అదృష్టం అని.. ఆయనతో నటించడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. తనతో చాట్ చేసిన ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్ చెబుతున్నానని.. కొంతమంది అభ్యంతరకర ప్రశ్నలు తప్ప చాటింగ్ సరదాగా సాగిందని తెలిపారు.


(ఇన్‌స్టాగ్రామ్‌లో నివేదా థామస్ పోస్ట్)

First published: November 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>