RRR మూవీలో నిత్యామీనన్... ఎన్టీఆర్‌కు జోడిగా క్రేజీ హీరోయిన్...

గిరిజన యువతి పాత్రలో మెరవబోతున్న నిత్యామీనన్?... ఎన్.టీ.ఆర్‌కు, నిత్యామీనన్‌కు మధ్య ప్రేమ సన్నివేశాలు... ‘జనతా గ్యారేజ్’ సినిమాలో కలిసి నటించిన నిత్యామీనన్, తారక్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 1, 2019, 2:25 PM IST
RRR మూవీలో నిత్యామీనన్... ఎన్టీఆర్‌కు జోడిగా క్రేజీ హీరోయిన్...
RRR మూవీలో నిత్యామీనన్... ఎన్టీఆర్‌కు జోడిగా గిరిజన యువతిగా...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 1, 2019, 2:25 PM IST
RRR... తెలుగులో ఈ సినిమా మీద వచ్చినన్ని రూమర్స్, మరే సినిమా మీద రాలేదేమో! మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్.టీ.ఆర్‌లతో కలిసి సంచలన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కలిసి దిగిన ఫోటో బయటికి వచ్చినప్పటి నుంచి ఈ సినిమాపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఫలానా హీరోయిన్ ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తోందంటూ, ఫలానా హీరో ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించబోతున్నాడంటూ వార్తలు షికార్లు చేస్తూనే ఉన్నాయి. షూటింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి శరవేగంగా షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంటున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీకి గాయాలు పెద్దగా ఇబ్బందిగా మారాయి. మొదట జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ రామ్ చరణ్ గాయపడి, కొంత కాలం షూటింగ్‌కి బ్రేక్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ కూడా ఈ చిత్ర షూటింగ్‌లో గాయపడ్డట్టు కొన్ని ఫోటోలు ద్వారా తెలిసింది. గాయాల బెడద పక్కన బెడితే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్‌కు ఉన్న పెద్ద సమస్య... ఎన్టీఆర్‌కు జోడిగా నటించే హీరోయిన్‌ను వెతకడం. తెలంగాణ సాయుధ పోరాట వీరుడు కొమరం భీం పాత్ర స్ఫూర్తిగా ఉండే ఎన్టీఆర్ పాత్రకు జోడిగా ముందు బ్రిటన్ సుందరి డైసీ ఎడ్గర్ జోన్స్‌‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది డైసీ ఎడ్గర్ జోన్స్. అప్పటి నుంచి ఈ పాత్రకు తగిన హీరోయిన్ కోసం సెర్చ్ చేస్తూనే ఉంది చిత్ర యూనిట్. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్, ఎన్.టీ.ఆర్ పక్కన హీరోయిన్‌గా నటిస్తుందంటూ కొన్ని వార్తలు షికార్లు కూడా చేశాయి.
RRR, ఆర్ఆర్ఆర్ మూవీ, హీరోయిన్ నిత్యామీనన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎస్ ఎస్ రాజమౌళి, ఆలియా భట్, టాలీవుడ్, అజయ్ దేవగణ్, ప్రభాస్, తెలుగు సినిమా, rrr movie, rrr movie updates, rrr movie cast, rrr ntr jr heroine, jr ntr heroine rrr movie, nithya menen, nithya menen hot, rrr movie cast and crew, rrr movie budget, rrr ram charan, ramcharan rrr movie, rrr ss rajamouli, rajamouli rrr movie, Director ss rajamouli movies, ajay devgan movies, Alia butt movies, alia butt in rrr, nithya menen hot show, nithya menen hot photoshoot, nithya menen instagram
చూడడానికి ఫారిన్ పిల్లగా ఉండే శ్రీలంక చిన్నది జాక్వెలీన్ ఫెర్నాండేజ్ కూడా ఈ సినిమా కోసం ఎంపికైనట్టు ప్రచారం జరుగుతోంది.

ఆ తర్వాత కొన్నాళ్లు ఈ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ జాక్వెలీస్ ఫెర్నాడేజ్‌ను ఎంపిక చేసినట్టు రూమర్స్ వచ్చాయి. స్వయంగా సల్మాన్ ఖాన్, ఎస్.ఎస్. రాజమౌళికి ఫోన్ చేసి, ఎన్.టీ.ఆర్ పక్కన బ్రిటన్ పిల్లగా జాక్వెలీస్ ఫెర్నాడేజ్ బావుంటుందని చెప్పినట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే అవేవీ కార్యరూపం మాత్రం దాల్చలేదు. తాజాగా ఈ సినిమాలో క్రేజీ హీరోయిన్ నిత్యామీనన్ హీరోయిన్‌గా నటిస్తోందంటూ ఓ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. పాత్ర నచ్చితే ఎంత చిన్న రోల్‌లో అయినా నటించడానికి సిద్ధంగా ఉంటుంది నిత్యా మీనన్. అందుకే ఆమె కెరీర్‌లో హీరోయిన్‌గా నటించిన సినిమాల కంటే ప్రత్యేక పాత్రల్లో మెరిసిన చిత్రాలే ఎక్కువ. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కూడా అలాంటి రోల్‌లో కనిపించబోతోందట నిత్యామీనన్. టాలీవుడ్‌లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో ఓ గిరిజన యువతి పాత్రలో మెరవబోతుందట నిత్యామీనన్. ఎన్.టీ.ఆర్, నిత్యామీనన్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమాకు ఎంతో కీలకం కానున్నాయని సమాచారం.

RRR, ఆర్ఆర్ఆర్ మూవీ, హీరోయిన్ నిత్యామీనన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎస్ ఎస్ రాజమౌళి, ఆలియా భట్, టాలీవుడ్, అజయ్ దేవగణ్, ప్రభాస్, తెలుగు సినిమా, rrr movie, rrr movie updates, rrr movie cast, rrr ntr jr heroine, jr ntr heroine rrr movie, nithya menen, nithya menen hot, rrr movie cast and crew, rrr movie budget, rrr ram charan, ramcharan rrr movie, rrr ss rajamouli, rajamouli rrr movie, Director ss rajamouli movies, ajay devgan movies, Alia butt movies, alia butt in rrr, nithya menen hot show, nithya menen hot photoshoot, nithya menen instagram
‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్ నటిస్తున్నారు. అజయ్ దేవగణ్ ముఖ్య పాత్రలో మెరుస్తుంటే, ఆలియా భట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు జోడిగా నటిస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో ఇలాంటి పాత్రలోనే కొణిదెల నిహారిక నటించబోతుంది. అయితే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రాణాప్రాయ స్థితిలో ఉన్నప్పుడు కాపాడే గిరిజన యువతి పాత్రలో మెరవబోతోంది నిహారిక. ఈ విషయాన్ని స్వయంగా మెగా డాటర్‌ ప్రకటించడం విశేషం. ఈ రెండు భారీ బడ్జెట్ సినిమాలు దేశభక్త ప్రధానంగా రూపొందుతున్న సినిమాలే కావడం మరో విశేషం. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాను మెగా పవర్ స్టార్, మెగా స్టార్ తనయుడు రామ్ చరణ్ దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తుంటే... దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

First published: May 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...