హోమ్ /వార్తలు /సినిమా /

Nazriya Nazim: తొలి అనుభవం ఎప్పటికీ ప్రత్యేకమే అంటున్న నజ్రియా!

Nazriya Nazim: తొలి అనుభవం ఎప్పటికీ ప్రత్యేకమే అంటున్న నజ్రియా!

nazriya nazim

nazriya nazim

Nazriya Nazim: తమిళ, మలయాళ నటి నజ్రియా నజీమ్ గురించి.. రాజా రాణి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందరికీ తెలిసిందే. ఈమె హీరోయిన్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

Nazriya Nazim: తమిళ, మలయాళ నటి నజ్రియా నజీమ్ గురించి.. రాజా రాణి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందరికీ తెలిసిందే. ఈమె హీరోయిన్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అంతేకాకుండా మలయాళంలో టీవీ ఛానల్ లో వ్యాఖ్యాతగా కూడా పనిచేసింది. అంతేకాకుండా ఈమెకు ఎంతో ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది నజ్రియా.

2006లో బాలనటిగా మలయాళం సినిమాలు పరిచయం కాగా.. ఆ తర్వాత మలయాళం సినిమాతోనే హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అంతే కాకుండా 2013లో తమిళం సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించి.. తన నటనకు మంచి గుర్తింపు అందుకుంది. అంతే కాకుండా ఎన్నో ఉత్తమనటి అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇక ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో నటించకపోగా రాజా రాణి డబ్బింగ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.

ఇక ఈమె ప్రస్తుతం ఓ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కానుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'అంటే సుందరానికీ' అనే సినిమాలో నాచురల్ స్టార్ నాని సరసన నజిరియా హీరోయిన్ గా నటించనుంది. ఇక ఈ సినిమాలో ఓ ప్రాజెక్టు కోసం ప్రస్తుతం బృందం హైదరాబాద్ లో ఉండగా.. ఈ సినిమా గురించి కొన్ని విషయాలు పంచుకుంది నజ్రియా.

తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో.. కొన్ని విషయాలు అభిమానులతో పంచుకుంది. అందరికీ నమస్కారం అంటూ, తన ఈరోజు తన మొదటి తెలుగు సినిమా షూటింగ్ లో అడుగు పెడుతున్నానని తెలిపింది. తొలి అనుభవం ఎప్పుడు ప్రత్యేకమైనదే అంటూ, అంటే సుందరానికి అనే సినిమాని కి తనకు ఎప్పుడూ ప్రత్యేకమే అని కొన్ని విషయాలు పంచుకుంది.

First published:

Tags: Hero nani, Heroine nazriya nazim, Tollywood film

ఉత్తమ కథలు