Home /News /movies /

HEROINE KRITHI SHETTY CRYING IN INTERVIEW SB

krithi shetty: ఇంటర్వ్యూలో అరిచిన యాంకర్... లైవ్‌లో ఏడ్చేసిన కృతిశెట్టి

కృతి శెట్టి

కృతి శెట్టి

కృతి శెట్టి ప్రస్తుతం వరుస సినిమాల్లో బిజీగా మారింది. యంగ్ హీరోలతో కలసి కొత్త సినిమాలు చేస్తోంది.ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో యాంకర్ల ప్రవర్తన చూసి కన్నీళ్లు పెట్టుకుంది కృతి.

    ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో కృతి శెట్టి(Krithi Shetty) ఒకరు.18 ఏళ్లకే `ఉప్పెన`(Uppena) మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది. 2021లో విడుదలైన తన ఫస్ట్ సినిమాతోనే.. అందర్నీ ఆకట్టుకుంది. ఉప్పెన ఎంత పెద్ద విజయం అందుకుందో అందరికీ తెలిసిందే. ఉప్పెన సక్సెస్‌తో కృతికి వరుసగా అవకాశాలు వస్తున్నాయి. నాగచైతన్యకు జంటగా బంగార్రాజు సినిమాలో కూడా ఆమె నటించింది. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్‌ సినిమాలో కూడా నటించి సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా మారింది.

    తాజాగా కృతిశెట్టి సుధీర్ బాబుతో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, రామ్‌కు జోడీగా `ది వారియర్‌`, నితిన్ సరసన `మాచర్ల నియోజవర్గం` చిత్రాలు చేస్తోంది. అలాగే కోలివుడ్‌లో సూర్యతో కలిసి 41వ చిత్రంలో హీరోయిన్‌గా కూడా చేస్తోంది. అయితే ఈక్రమంలో తమిళనాట కృతి శెట్టి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నది. ప్రాంక్ స్టర్లు ఆశిక్, సారథిరన్ కృతిని ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో కృతి కన్నీళ్లు పెట్టుకుంది. యాంకర్ల ప్రవర్తన చూసి ఆమె ఎమోషనల్ అయిపోయింది.

    వివరాల్లోకి వెళ్తే... ఇంటర్వ్యూ జరుగుతుండగా... యాంకర్లిద్దరూ ముందు కృతిశెట్టిని నేను ప్రశ్నలు అడుగుతానంటే, నేను అడుగుతానని ఒకరిపై ఒకరు కేకలు వేసుకున్నారు. అంతేకాదు.. హీరోయిన్ ఎదుటే కొట్లాకు కూడా దిగారు. దాంతో ఏం జరుగుతుందో తెలియక కృతి భయపడిపోయింది. ఆ తర్వాత వారు ప్రాంక్ అనడంతో ఊపిరి పీల్చుకున్న కృతి.. మొదట నవ్వినా ఆపై దుఖం ఆపుకోలేక లైవ్‌లోనే ఏడ్చేసింది. దాంతో ఆమెకు సర్థిచెప్పారు సదరు యాంకర్లు.. ఆ తర్వాత ఎందుకు ఏడ్చారు, ఏమైంది అని ప్రశ్నించారు.

    అందుకు కృతి ఎవరైనా కఠినంగా మాట్లాడితే తనకు అస్సలు నచ్చదని, భయం వేస్తుందని చెప్పుకొచ్చింది. మొత్తానికి కృతి ఏడుస్తున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆమె అభిమానులు అయ్యో.. ఇంటర్వ్యూకు పిలిచి అమ్మాయిని ఏడిపిస్తారా అంటూ యాకంర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేం ప్రాంక్ అంటూ.. యాంకర్ల తీరుపై మండిపడుతున్నారు. మరికొందరు.. కృతిపై జాలి కూడా చూపిస్తున్నారు. ఇంత సున్నితంగా ఉంటే ఎలా అంటూ... ప్రశ్నిస్తున్నారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Krithi shetty, Uppena

    తదుపరి వార్తలు