ఏ టైంలో పుట్టావమ్మా... సమంతపై చార్మీ ట్వీట్

ఈ సినిమా యూఎస్, యూకేలలో ప్రీమియర్ షోలు ప్రదర్శించడంతో ట్విట్టర్ ద్వారా స్పందనలు తెలియజేస్తున్నారు నెటిజన్లు.

news18-telugu
Updated: July 6, 2019, 11:02 AM IST
ఏ టైంలో పుట్టావమ్మా... సమంతపై చార్మీ ట్వీట్
సమంతా , చార్మీ
  • Share this:
వరుస విజయయాలతో దూసుకుపోతున్న సమంత నటించిన మరో చిత్రం విడుదలైంది. సమంత మెయిన్ రోల్ చేసిన ‘ఓ బేబి’ సినిమా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ అందుకోంది. దీంతో ఇప్పుడు ఈ బేబీపై అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముద్దుగుమ్మ సమంతపై నటి ఛార్మి పొగడ్తల వర్షం కురిపించింది. ‘ఓ బేబీ’ సినిమా మంచి టాక్‌ అందుకున్న నేపథ్యంలో ఛార్మి ట్వీట్‌ చేశారు. ‘ఏ టైమ్‌లో పుట్టావమ్మా నువ్వు.. నీ శ్రమ, నీ నిర్ణయాలు, నీ జాతకానికి నమస్కారం.. నందిని రెడ్డి, మిగిలిన చిత్ర బృందం పట్ల చాలా సంతోషంగా ఉంది’ అంటూ సామ్‌ రాక్స్‌, ఓ బేబీ రాక్స్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌లను పెట్టి చార్మీ పోస్టు చేసింది. ఈ పోస్టుు సామ్ రిప్లై కూడా ఇచ్చింది. ‘నువ్వు ఎంతో క్యూటెస్ట్‌.. ధన్యవాదాలు ఛార్మి. నీకు నా ఆత్మీయ కౌగిలి, ముద్దుల్ని పంపుతున్నా’ అని ట్వీట్‌ చేశారు. దీనికి బొద్దుగుమ్మ చార్మీ నవ్వుతూ.. ఎమోజీలను పోస్ట్‌ చేశారు.

ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌లతో సినిమాపై అంచనాలను పెంచేసిన సమంత.. ఈ మూవీ ప్రమోషన్స్ మొత్తాన్ని తన భుజాల వేసుకుని మునుపెన్నడూ లేనంతా విపరీతమైన ప్రచారాన్ని తీసుకువచ్చారు. ఈ చిత్రానికి విడుదలకు ముందే మంచి హైప్ రావడంతో సమంత సోలో మూవీని ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం భారీగా విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమా యూఎస్, యూకేలలో ప్రీమియర్ షోలు ప్రదర్శించడంతో ట్విట్టర్ ద్వారా స్పందనలు తెలియజేస్తున్నారు నెటిజన్లు. సమంత కెరియర్‌‌లోనే బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చిందని.. రాక్ స్టార్‌లా సమంత నటనతో మెరిసిందని.. క్లైమాక్స్ హార్ట్ టచ్చింగ్‌గా ఉందంటున్నారు.


Published by: Sulthana Begum Shaik
First published: July 6, 2019, 10:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading