హోమ్ /వార్తలు /సినిమా /

బాల‌య్య కంటే ఆమెకు అతనే ఎక్కువైయ్యాడా?

బాల‌య్య కంటే ఆమెకు అతనే ఎక్కువైయ్యాడా?

బాలకృష్ణ (Twitter/Photo)

బాలకృష్ణ (Twitter/Photo)

Bala Krishna - Anjali Movie: హీరోయిన్ అంజలిని బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమాలో నటించమని అడిగితే ఆమె కాదంది. కానీ చివరకు ఏం చేసిందో తెలుసా..?

  హీరోయిన్ అంజ‌లి వ‌రస చూస్తుంటే ఆమెకు టాలీవుడ్ కంటే కోలీవుడ్ ఎక్కువైంద‌ని అనిపిస్తుంది. బేసిగ్గా తెలుగు అమ్మాయి అయిన అంజ‌లి కెరీర్ ప్రారంభంలో ఆమెకు త‌మిళ చిత్రాలే ఎక్కువ గుర్తింపును తెచ్చిపెట్టాయి. త‌ర్వాత ఆమె తెలుగులోనూ హీరోయిన్‌గా స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించింది. ఫిజిక్ మీద దృష్టి పెట్ట‌కుండా ఒక‌వైపు.. కోలీవుడ్ హీరోతో ప్రేమాయ‌ణం మ‌రోవైపు కార‌ణంగా ఆ ముద్దుగుమ్మ బొద్దుగా త‌యార‌వ‌డ‌మే కాకుండా... సినిమాల‌ను నిర్ల‌క్ష్యం చేసింది. దీంతో ఆమెకు క్ర‌మంగా సినిమా అవ‌కాశాలు త‌గ్గాయి. ఇంత‌కీ ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు, అంజ‌లి. అటు త‌మిళం, ఇటు తెలుగు సినిమాల్లో త‌న‌కంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న ఈమె బ్రేక‌ప్ త‌ర్వాత త‌న త‌ప్పుల‌ను స‌రిదిద్దుకునే ప‌నిలో ప‌డింది. బ‌రువు త‌గ్గి స్లిమ్‌గా త‌యారైంది. దీంతో ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆమెకు అవ‌కాశాలు ఇవ్వ‌డం ప్రారంభించారు.

  అవ‌కాశాలు కోసం ఎదురుచూస్తున్న అంజ‌లికి ఏమైందో ఏమో కానీ.. ఈమ‌ధ్య‌తెలుగులో ఓ స్టార్ హీరో సినిమాలో అవ‌కాశం వ‌స్తే చేయ‌న‌ని చెప్పింద‌ట‌. ఇంతకీ అంజ‌లి రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవ‌రో కాదు.. నంద‌మూరి బాల‌కృష్ణ అని వినికిడి. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టించ‌మ‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు అంజ‌లి ఆ మ‌ధ్య అప్రోచ్ అయితే నేను బిజీగా ఉన్నాన‌ని చెప్పేసింది. అయితే ఇది వ‌ర‌కు బాల‌కృష్ణ హీరోగా చేసిన ‘డిక్టేట‌ర్’ సినిమాలో అంజ‌లి మెయిన్ హీరోయిన్‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. కానీ ఇప్పుడు బాల‌య్యను ప‌క్క‌న పెట్టి త‌మిళ ద‌ర్శ‌కుడు, న‌య‌న‌తార ప్రియుడు విఘ్నేశ్ శివ‌న్ డైరెక్ట్ చేసిన ‘పావై క‌థ‌గ‌ల్‌’ అనే వెబ్ సిరీస్‌లోని నాలు గు పార్టుల్లో ఒక‌దానిలో న‌టించింది. అమ్మ‌డు వ‌రుస గ‌మ‌నించిన కొంద‌రు.. అవ‌కాశాలు లేన‌ప్పుడు బాల‌కృష్ణ సినిమాను రిజెక్ట్ చేయ‌డ‌మేంటి? అంటే బాల‌య్య సినిమా కంటే విఘ్నేశ్ శివ‌న్ వెబ్ సిరీసే ఎక్కువైందా? అని అనుకుంటున్నారు. మ‌రి ఈ వార్త‌ల‌పై అంజ‌లి ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.

  ఈ ఏడాది అనుష్క‌తో అంజ‌లి క‌లిసి న‌టించిన నిశ్శ‌బ్దం సినిమా విడుద‌లైంది. థియేట‌ర్స్‌లో విడుద‌ల కాలేదు. డైరెక్ట‌ర్ అమెజాన్‌లో విడుద‌లైంది. సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేదు. ఈ సినిమాలో అంజ‌లి ఓ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించి ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం తెలుగులో ‘ఆనంద‌భైర‌వి’ సినిమాతో పాటు ప‌వ‌న్ క‌ల్యాణ్ ‘వ‌కీల్‌సాబ్‌‘లోనూ అంజ‌లి న‌టిస్తోంది.

  Published by:Anil
  First published:

  Tags: Bala Krishna, Bala Krishna Nandamuri, Boyapati Srinu, NBK 106

  ఉత్తమ కథలు