హీరోయిన్ అమలా పాల్ ఇంట్లో తీవ్ర విషాదం..

అమలాపాల్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికే చాలా సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.తాజాగా ఈమె ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

news18-telugu
Updated: January 22, 2020, 11:14 AM IST
హీరోయిన్ అమలా పాల్ ఇంట్లో తీవ్ర విషాదం..
అమలా పాల్ (Instagram/Photo)
  • Share this:
అమలాపాల్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికే చాలా సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.తాజాగా ఈమె ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి పాల్ వర్గీస్ అనారోగ్యంతో కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. 61 ఏళ్ల వయసున్న పాల్ వర్గీస్ జనవరి 21న కొచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. విషయం తెలుసుకున్న అమలాపాల్ వెంటనే కొచ్చి వచ్చేసింది. ఓ సినిమా షూటింగ్ లో ఉన్న ఆమెకు తండ్రి మరణ వార్త పిడుగులా తగిలింది. వెంటనే అక్కడ్నుంచి హుఠాహుఠిన ఇంటికి చేరుకుంది. తల్లిని ఓదారుస్తూ అక్కడే ఉండిపోయింది. పాల్ వర్గీస్ అంత్యక్రియలు జనవరి 22 సాయంత్రం కురుప్పంపాడు చర్చిలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం జరగనున్నాయి. అమలాపాల్ సినిమాల్లోకి రావడం ముందు నుంచి పాల్‌కు ఇష్టం లేదు. కానీ తండ్రిని ఒప్పించి ఇండస్ట్రీకి వచ్చింది. తక్కువ సమయంలోనే తమిళం, తెలుగు, మలయాళ పరిశ్రమల్లో సినిమాలు చేసి నటిగా మంచి పేరు తెచ్చుకుంది. కేవలం నటిగానే కాకుండా వివాదాల్లో కూడా ఈమె పేరు ఎప్పుడూ కనిపిస్తుంది.

First published: January 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు