మామూలు జ్వరానికి రూ. లక్ష బిల్లు... హీరోయిన్‌కు షాకిచ్చిన ఆస్పత్రి

Aishwarya Rajesh: కార్పొరేట్ ఆస్పత్రిలో తనకు ఎదురైన ఓ అనుభవాన్ని వివరించి వాపోయింది అందాల భామ ఐశ్వర్య రాజేశ్.

news18-telugu
Updated: August 22, 2019, 6:57 PM IST
మామూలు జ్వరానికి రూ. లక్ష బిల్లు... హీరోయిన్‌కు షాకిచ్చిన ఆస్పత్రి
ఐశ్వర్య రాజేశ్
  • Share this:
కార్పొరేట్ ఆస్పత్రులు రోగులను ఏ రేంజ్‌లో దోచుకుంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సామాన్యులకే కాదు... సెలబ్రిటీలకు సైతం ఇలాంటి అనుభవాలు ఉంటాయి. తాజాగా తనకు ఎదురైన ఇలాంటి ఓ అనుభవాన్ని మీడియాకు వివరించింది హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్. ఇటీవల తనకు మామూలు జ్వరం వస్తే ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాలని వివరించిన ఐశ్వర్య... వాళ్లు చెప్పినట్టు చికిత్స కోసం అందులో చేరినట్టు తెలిపింది. ఆస్పత్రిలో చేరిన మరుసటి రోజు తన పరిస్థితి మామూలుగా ఉండటంతో డిశ్చార్చ్ అవుతానని వారికి చెప్పానని... కానీ ఆదివారం కుదరదని వారు చెప్పినట్టు ఆమె వివరించింది.

కొన్ని పరీక్షలు జరిపిన వారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే రోజు తన చేతికి రూ.లక్ష బిల్లు వేసినట్టు ఐశ్వర్య తెలిపింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయానికి సాధారణ జ్వరానికి వాడే ట్యాబెట్లను చేతిలో పెట్టారని వాపోయింది. తన లాంటి సెలబ్రిటీ విషయంలోనే ఇలా జరిగితే... సామాన్యుల సంగతి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి భయమేస్తుందని వ్యాఖ్యానించింది.

త్వరలోనే కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ అందాల భామ...ఈ సినిమా తనకు తెలుగులో మంచి గుర్తింపు తెచ్చిపెడుతుందని నమ్ముతోంది. వైద్య వృత్తిలో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కినట్టు సమాచారం. కోలీవుడ్‌లో బాగా పాపులర్. ప్రస్తుతం ఆమె చేతిలో ఏకంగా 14 సినిమాలు ఉన్నాయి.First published: August 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు