ఆదా శర్మకు 'పెళ్లి కొడుకు' కావలెను.. కండిషన్స్ ఏంటంటే..

ఆదా శర్మ

ఆదాశర్మ సరదా కోసం ఈ పోస్ట్ చేసిందా..? లేక ఏదైనా ప్రమోషన్ కోసమా అన్నది అంతుపట్టడం లేదు. లేక సక్సెస్‌లకు దూరమై సినిమాల నుంచి తప్పుకుని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిందా? అని కొంతమంది ఆరా తీస్తున్నారు.

 • Share this:
  తెలుగులో స్టార్ హీరో సినిమాల్లో హీరోయిన్‌గా నటించినా ఆదా శర్మకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు. దీంతో గ్లామర్ పాత్రలను పక్కనపెట్టి విభిన్న పాత్రలను ఎంచుకుంటోంది. ఈ క్రమంలోనే అబీర్‌సేన్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'మెన్ టు మెన్' చిత్రంలో ఆమె హిజ్రా పాత్రలో నటిస్తోంది. ఇదే సినిమాలో పురుషుడి పాత్రలోనూ ఆమె నటిస్తున్నట్టు టాక్. ఈ సినిమాతో బిజీగా ఉన్న సమయంలోనే ఆదా శర్మ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఉన్నట్టుండి 'వరుడి కావలెను' అని ఆదా శర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడమే దీనికి కారణం.పెళ్లి కుమార్తె గెటప్‌లో ఉన్న ఓ ఫోటోను షేర్ చేసి వరుడికి ఉండాల్సిన లక్షణాల గురించి కూడా వివరించింది.

  అతను ఉల్లిపాయలు తినకూడదు. కులం, మతం, రంగు, షూ సైజ్, వీసా, స్విమ్మింగ్, కండలు ఇలాంటి పట్టింపులేవీ లేవు. కానీ రోజుకు 3 పూటలు నవ్వుతూ వండి పెట్టాలి. రోజూ షేవింగ్ చేసుకోవాలి. కచ్చితంగా సాంప్రదాయ దుస్తులే దరించాలి. అతనికి రోజుకు 5 లీటర్ల మంచి నీరు అందిస్తా. కానీ మద్యం,మాంసాహారం ఇంటా బయటా నిషేధం. అన్ని భాషల భారతీయ చిత్రాలపై అతనికి గౌరవం ఉండాలి.. వాటిని చూసి ఎంజాయ్ చేసేవాడై ఉండాలి.
  హీరోయిన్ ఆదా శర్మ


  ఆదా శర్మ సరదా కోసం ఈ పోస్ట్ చేసిందా..? లేక ఏదైనా ప్రమోషన్ కోసమా అన్నది అంతుపట్టడం లేదు. లేక సక్సెస్‌లకు దూరమై సినిమాల నుంచి తప్పుకుని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిందా? అని కొంతమంది ఆరా తీస్తున్నారు. మొత్తం మీద ఆదాశర్మ పెట్టిన పోస్టుకు అర్థమేంటో తెలియక ఫ్యాన్స్ జుట్టు పీక్కుంటున్నారు.  Published by:Srinivas Mittapalli
  First published: