మరో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ స్నేహ..

రామ్ చరణ్ వదిన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రామ్ చరణ్‌కు వదిన ఏంటి అని కంగారు పడకండి. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: January 24, 2020, 10:20 PM IST
మరో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ స్నేహ..
హీరోయిన్ స్నేహ (File/Photo)
  • Share this:
ప్రముఖ సీనియర్ హీరోయిన్ స్నేహ ఈ శుక్రవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్నేహ భర్త సినీ హీరో ప్రసన్న సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. స్నేహ విషయానికొస్తే.. 2000లో ‘ఒరు నీల పక్షి’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయింది. తెలుగులో తరుణ్ హీరోగా నటించిన ‘ప్రియమైన నీకు’ స్నేహకు మొదటి సినిమా. ఆ తర్వాత సీనియర్ టాలీవుడ్ హీరోలైన బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ సరసన పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. హీరోయిన్‌గా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే తమిళ నటుడు ప్రసన్నను ప్రేమ వివాహాం చేసుకుంది. వీరిద్దరికి ఇప్పటికే విహాన్ అనే పిల్లాడు ఉన్నాడు. తాజాగా శుక్రవారం వీళ్లింట్లోకి మహాలక్ష్మి వచ్చిందని సంబరపడిపోతున్నారు.

heroin sneha blessed with baby girl,heroin sneha blessed with baby girl,sneha blessed with baby girl,sneha baby shower,sneha twitter,sneha instagram,seha facebook,actress sneha baby shower,actress sneha baby shower photos,baby shower,sneha baby shower function,sneha prasanna baby shower,sneha,actress sneha seemantham,actress sneha seemantham photos,actress sneha,sneha prasanna,sneha baby shower pics,sneha baby shower photos,sneha's baby shower,actress sneha baby shower video,sneha baby shower function photos,actress sneha baby shower function,kollywood,tollywood,స్నేహ,స్నేహ సీమంతం,హీరోయిన్ స్నేహ సీమంతం,స్నేహ ప్రసన్న,పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన స్నేహ
భర్త పిల్లాడితో హీరోయిన్ స్నేహ (Instagram/Photo)


రీసెంట్‌గా మళ్లీ సినిమాల్లో  రీ ఎంట్రీ ఇచ్చింది. రామ్ చరణ్ హీరోగా నటించిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో హీరో వదిన పాత్రలో నటించింది. తాజాగా సంక్రాంతికి తమిళంలో ధనుశ్ హీరోగా నటించిన ‘పటాస్’లో ఒక కథానాయికగా నటించింది.  ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే అందుకుంది.


 View this post on Instagram
 

Its a girl❤❤


A post shared by Sneha Prasanna (@realactress_sneha) on
First published: January 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు