విడాకులు తీసుకున్న మరో టాలీవుడ్ హీరోయిన్..

ఇండ‌స్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జ‌రుగుతున్నాయో.. విడాకులు కూడా అంతే వేగంగా జ‌రిగిపోతుంటాయి. కొంద‌రు మాత్రం అలాగే ద‌శాబ్ధాల పాటు క‌లిసుంటున్నారు కానీ మ‌రికొంద‌రు మాత్రం కొన్నేళ్ల‌కే విడిపోతున్నారు. తాజాగా టాలీవుడ్‌కు చెందిన మరో హీరోయిన్ విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించింది.

news18-telugu
Updated: December 10, 2019, 11:55 AM IST
విడాకులు తీసుకున్న మరో టాలీవుడ్ హీరోయిన్..
ప్రతీతాత్మక చిత్రం (Facebook/photo)
  • Share this:
ఇండ‌స్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జ‌రుగుతున్నాయో.. విడాకులు కూడా అంతే వేగంగా జ‌రిగిపోతుంటాయి. కొంద‌రు మాత్రం అలాగే ద‌శాబ్ధాల పాటు క‌లిసుంటున్నారు కానీ మ‌రికొంద‌రు మాత్రం కొన్నేళ్ల‌కే విడిపోతున్నారు. రీసెంట్‌గా తెలుగులో మంచు మనోజ్ తన వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ తన భార్యకు విడాకులు తీసుకున్నట్టు ప్రకటిచడం సంచలనం అయింది.  అంతకు ముందు దియా మీర్జా,  కే.రాఘవేంద్రరావు కొడుకు కే.ప్రకాష్ కోవెలమూడి,కనికా థిల్లాన్ ఇలానే విడాకులు తీసుకున్నారు. తాజాగా ఈ లిస్టులో మరో టాలీవుడ్ హీరోయిన్ చేరింది. తెలుగులో ‘కొత్త బంగారులోకం’ సినిమాతో పరిచయమైన శ్వేతా బసు ప్రసాద్.. ఫస్ట్ సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Shweta Basu Prasad
డిసెంబర్ 13న తన బాయ్ ఫ్రెండ్ రోహిత్ మిట్టల్‌ను వివాహం చేసుకున్న ‘కొత్త బంగారు లోకం’ ఫేమ్ శ్వేతా బసు ప్రసాద్ (Image: Shweta Basu Prasad/Instagram)


ఆ తర్వాత ఈమె వ్యభిచారం కేసు అభియోగంలో మరోసారి వార్తల్లో నిలిచింది. గత యేడాది శ్వేతా బసు ప్రసాద్.. ప్రముఖ వ్యాపారవేత్త రోహిత్ మిత్తల్‌‌ను డిసెంబర్ 13న   ప్రేమ వివాహాం చేసుకుంది.  తాజాగా ఆమె తమ వైవాహిక బంధానికి పులిస్టాప్ పెట్టి విడాకులు తీసుకున్నట్టు ప్రకటించింది. పెళ్లై యేడాది తిరక్కాండానే ఈ జంట విడాకులు తీసుకోవడం సినీ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ సందర్భంగా శ్వేతా మాట్లాడుతూ.. రోహిత్‌తో నేను గడిపిన క్షణాలు మరవలేనవి అంటూ రాసుకొచ్చింది. ఇక ఇప్పటి  నుంచి ఎవరి దారిలో వారు ప్రయాణించాలని డిసైడ్ అయి ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది. View this post on Instagram

 

A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) on
Published by: Kiran Kumar Thanjavur
First published: December 10, 2019, 11:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading