హోమ్ /వార్తలు /సినిమా /

Samantha: ముంబైలో కొత్త ఇల్లు కొంటున్న సమంత... మకాం మార్చేస్తోందా ?

Samantha: ముంబైలో కొత్త ఇల్లు కొంటున్న సమంత... మకాం మార్చేస్తోందా ?

ముంబై బీచ్‌కు దగ్గర్లో సమంత రెండు ఫ్లాట్లు కొంటున్నట్లు సమాచారం. వీటి విలువ కూడా కోట్లలో ఉందని తెలుస్తోంది. త్వరలో సమంత ఈ ఇంటిలోకి వెళ్తుందని కూడా తెలుస్తోంది.

  స్టార్ హీరోయిస్ సమంత ఫుల్ బిజీగా మారింది. చేతిలో ఏదో ఓ ప్రాజెక్టు పెట్టుకుంటూ నిత్యం సినిమాలు,వెబ్ సిరీస్‌తో బిజీ బిజీగా మారింది. `ఏం మాయ చేసావె` చిత్రంలో ఆన్ స్క్రీన్‌‌పై నాగచైతన్యతో కలిసి తొలిసారి నటించిన సామ్ ఆ తర్వాత చైతూనే ప్రేమించి పెళ్లాడింది. 2017లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. హిందూ సాంప్రదాయల ప్రకారం, అటు క్రిస్టియన్‌ ట్రెడిషన్‌ ప్రకారం రెండుసార్లు వీరి వివాహం జరిగింది.ఈ జంటని చూసి చాలా మంది అభిమానులు మురిసిపోయారు. కాని ఊహించని విధంగా గతేడాది అక్టోబర్‌లో ఈ జంట విడాకులు తీసేసుకుంది. విడాకుల తర్వాత కూడా సమంత ఏ మాత్రం తగ్గడం లేదు. మరింత బిజీగా మారి వరుసగా సినిమాలు చేస్తోంది.

  ఇటీవలే అల్లు అర్జున్ పుష్ప సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ చేసింది సమంత. అటు బాలీవుడ్‌లో కూడా బిజీగా మారింది భామ. ఇద్దరు హీరోలతో సామ్ బాలీవుడ్లో సినిమాలు చేస్తున్నట్లు సమాచారం. యంగ్ హీరో వరుణ్ ధావన్‌తో పాటు.. బాలీవుడ్ ప్రముఖ హీరో అక్షయ్ కుమార్‌తో కలిసి సామ్ సినిమాలు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల బాలీవుడ్ హీరోలతో బాగా క్లోజ్‌గా ఉంటుంది. వారితో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా వారికి ఛాలెంజ్‌లు విసురుతుంది. అయితే రానున్న రోజులలో బాలీవుడ్‌లో మరిన్ని సినిమాలు హిందీలో చేయాలని ఈ అమ్మడు భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో సమంత ముంబైలో రెండు సీ ఫేసింగ్ ఫ్లాట్స్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

  ఆ రెండింటిలో ఒక దానిని సమంత కొనబోతోందట. అయితే ఈ ఒక్కో ఫ్లాట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఈ ఒక్కో ఫ్లాట్ ఖరీదు రూ. 3 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ రెండు ఫ్లాట్స్ ఇంకా నిర్మాణంలో ఉన్నాయి. అయితే పక్కాగా తన కెరీర్‌ను ప్లాన్ చేస్తున్న సమంతను చూసి అందరూ షాక్ అవుతున్నారు. జీవితంలో ఎలాంటి అనుభవాలు ఎదురైనా.. ధైర్యంగా ఎదుర్కొంటూ.. ముందుకెళ్తున్న సమంతను చూసి ఎంతో నేర్చుకోవాలనుకుంటున్నారు. .

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Bollywood, Samantha akkineni, Samantha Ruth Prabhu

  ఉత్తమ కథలు