పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికర విషయాల్ని చెప్పిన సమంత

పవన్ పవర్ స్టార్ అయినా.. ఎంతో సాధారణ మనస్తత్వం ఉన్న వ్యక్తి అనిపించిందని సమంత పవన్‌పై ప్రశంసలు కురిపించింది.

news18-telugu
Updated: September 10, 2019, 2:55 PM IST
పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికర విషయాల్ని చెప్పిన సమంత
పవన్ కల్యాణ్ , సమంత అక్కినేని
  • Share this:
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు బయటే కాదు.. సినీ ఇండస్ట్రీలో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. ఆయన తోటి హీరో, హీరోయిన్లు కూడా పవన్ అంటే ప్రత్యేకంగా అభిమానిస్తుంటారు. ఆయన కోసం ఎవరో ఒకరు నిత్యం ఏదో ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేప్తుంటారు. తాజాగా సమంత పవన్ కల్యాణ్‌కు సంబంధిచిన కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది.‘ అత్తారింటికి దారేది ’ సినిమాలో పవన్‌తో కలిసి నటించిన సమంత.. ఆ సినిమా షూటింగ్‌లో పవన్ వ్యవహార శైలిపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది.

‘అత్తారింటికి దారేది’ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర సన్నివేశాన్ని సమంత ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతూ ఆయన సిగ్గు చాలా ఎక్కువంది. జనం ఎక్కువగా ఉంటే వారి మధ్యలో షూటింగ్ చేయడానికి పవన్ కొంచెం ఇబ్బందిపడతారని చెప్పింది సమంత. ఎక్కువ మందిలో పాటల షూటింగ్ అంటే పవన్ కల్యాణ్‌కు ఎక్కడలేని సిగ్గు వచ్చేస్తుందని తెలిపింది. అత్తారింటికి దారేది చిత్రం సందర్భంగా స్విట్జర్లాండ్ షెడ్యూల్ లో ఆయన సిగ్గు చూసి తాను నవ్వాపుకోలేకపోయానని చెప్పింది సామ్.

స్విట్జర్లాండ్‌లోని అందమైన లొకేషన్లలో ఓ పాట షూట్ చేస్తుండగా, చాలామంది జనం వచ్చారని, వాళ్లను చూసిన పవన్ తాను స్టెప్పులు వేయలేనంటూ కారవాన్ వద్దకు వెళ్లిపోయారని సమంత చెప్పుకొచ్చింది. దీంతో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వెళ్లి "పవన్ నువ్వు చేయగలవు!" అంటూ ఆయనలో కాన్ఫిడెన్స్ నింపారని చెప్పింది. దాంతో "నేను చేయగలనంటావా!" అంటూ పవన్ కాస్త బిడియంగా బెరుకుగా మాట్లాడ్డం చూసి నవ్వుకున్నానని సమంత తెలిపింది. పవన్ పవర్ స్టార్ అయినా ఎంతో సాధారణ మనస్తత్వం ఉన్న వ్యక్తి అనిపించిందని సమంత పవన్‌పై ప్రశంసలు కురిపించింది. ఆ మనస్తత్వమే పవన్ లో తనకు బాగా ఇష్టమైన అంశమంది సమంత.
First published: September 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading