పవన్ కల్యాణ్‌లో ఎలాంటి మార్పు లేదు... రాశీ ఆసక్తికర వ్యాఖ్యలు

ఒకప్పటి పవన్ కల్యాణ్ గారు అనుకుని మీరు నేరుగా వచ్చేశారు .. ఆయనను ఇప్పుడు కలవడం కష్టమేననుకుంటాను మేడమ్ అంటూ డ్రైవర్ తనకు చెప్పాడన్నారు రాశి.

news18-telugu
Updated: November 12, 2019, 2:55 PM IST
పవన్ కల్యాణ్‌లో ఎలాంటి మార్పు లేదు... రాశీ ఆసక్తికర వ్యాఖ్యలు
పవన్ కల్యాణ్,రాశి
  • Share this:
అప్పటి హీరోయిన్ అందాల రాశిని... తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. తన నటనతో అందరి మనసుల్ని మెప్పించింది. వరుస హిట్ సినిమాలతో టాప్ హీరోయిన్లకు సైతం గట్టి పోటీ ఇచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన అరకొర సినిమాల్లో మాత్రం ఆమె కనిపించింది. ఆ తర్వాత కొన్ని టీవీ షోల్లో ఆమె హల్ చల్ చేసింది. అయితే తాజాగా అలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చిన రాశి మాట్లాడుతూ... పవన్ కల్యాణ్‌పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నాలుగేళ్ల క్రితం పవన్‌ను కలిసిన విషయం గుర్తు చేసుకుంది. రాశీ మాట్లాడుతూ "నాలుగేళ్ల క్రితం మా పాప మొదటి పుట్టిన రోజుకి పవన్ కల్యాణ్ ను ఆహ్వానించడానికి వెళ్లాను. అయితే అప్పుడు ఆయన షూటింగులో బిజీగా వున్నారు. పవన్ కల్యాణ్ గారితో నేను 'గోకులంలో సీత' సినిమా చేశాను. ఆ తరువాత ఆయనను ఎక్కడా కలవలేదు. తెలిసిన మనిషే కదా అని నేరుగా కార్లో ఆయన వున్న షూటింగ్ లొకేషన్ కి వెళ్లిపోయానన్నారు రాశి.

అయితే పవన్ కల్యాణ్ క్యారవాన్ దగ్గర చాలామంది వున్నారు. 'ఒకప్పటి పవన్ కల్యాణ్ గారు అనుకుని మీరు నేరుగా వచ్చేశారు .. ఆయనను ఇప్పుడు కలవడం కష్టమేననుకుంటాను మేడమ్ .. అపాయింట్ మెంట్ ఉండాలేమో'నని తన డ్రైవర్ అన్నడాన్నారు. అయితే సరే.. ఒక ప్రయత్నం చేసి చూద్దామని డ్రైవర్ తోనే కబురు పెట్టానని రాశీ చెప్పుకొచ్చారు. 'అయ్యో కబురు చేయడమేంటి రమ్మని చెప్పు' అంటూ పవన్ .. డ్రైవర్ ను నా దగ్గరికి పంపించారు. పవన్ వద్దకు వెళితే ఎంతో ఆప్యాయంగా పలకరించి చాలాసేపు మాట్లాడారంటూ ఆ విషయాల్ని గుర్తు చేసుకున్నారు రాశి. పవన్ కల్యాణ్ క్రేజ్ పెరిగిందిగానీ .. ఆయన మాత్రం మారలేదనిపించిందంటూ పొగడ్తలు కురిపించారు రాశి.
Published by: Sulthana Begum Shaik
First published: November 12, 2019, 2:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading