Home /News /movies /

HEROIN RAKUL PREETH SINGH MAY DO A ITEM SONG FOR NANIVIKRAM KUMARS GANG LEADER MOVIE SAYS REPORT TA

అయ్యో పాపం రకుల్.. చివరకు ఐటెం సాంగ్స్‌కు సై అంటున్న చరణ్ భామ.. ?

రకుల్ ప్రీత్ Photo: Twitter.com/Rakulpreet

రకుల్ ప్రీత్ Photo: Twitter.com/Rakulpreet

రకుల్ ప్రీత్ సింగ్..  నిన్న మొన్నటి వరకు తెలుగులో పెద్ద హీరోలతో ఆడిపాడిన ఈ కథానాయికకు ఇపుడు వరుస పరాజయాలు పలకరిస్తున్నాయి. తాజాగా ఎన్జీకే మూవీ ఫ్లాప్ అయింది దీంతో హీరోయిన్‌గానే కాకుండా ఐటెం సాంగ్స్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

ఇంకా చదవండి ...

    రకుల్ ప్రీత్ సింగ్..  నిన్న మొన్నటి వరకు తెలుగులో పెద్ద హీరోలతో ఆడిపాడిన ఈ కథానాయికకు ఇపుడు వరుస పరాజయాలు పలకరిస్తున్నాయి. మహేష్ బాబుతో చేసిన ‘స్పైడర్’మూవీపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా అట్టర్ ఫ్లాపైంది. ఆ తర్వాత ‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో శ్రీదేవి పాత్రలో కాసేపు మెరిసిన ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఈ భామ వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా నటిస్తోన్న సినిమాలో హీరోయిన్‌గా అవకాశం వచ్చినట్టే వచ్చిన చేజారిపోయింది. ప్రెజెంట్ తెలుగు ఈ భామ నాగార్జున హీరోగా నటిస్తోన్న ‘మన్మథుడు 2’లో కథానాయికగా నటిస్తోంది. రీసెంట్‌గా ఈ భామ హిందీలో అజయ్ దేవ్‌గణ్ సరసన నటించిన ‘దే దే ప్యార్ దే’ మాత్రం బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. తాజాగా తమిళంతో పాటు తెలుగులో విడుదలైన ‘ఎన్జీకే’ సినిమా డిజాస్టర్‌ టాక్ రావడం రకుల్ ప్రీత్ సింగ్‌కు పెద్ద ఝలక్ అనే చెప్పాలి. ఈ సినిమా డిజాస్టర్‌తో రకుల్‌ను అందరు ఐరన్ లెగ్ అని అంటున్నారు. గతంలో ఐరన్ లెగ్ ముద్ర వేయించుకున్న నటీమణులు చాలా మంది ఐటెం పాటలతో తమపై ఉన్న ముద్రను చెరిపేసుకున్నారు. ఇపుడు రకుల్ ప్రీత్ సింగ్ కూడా అవసరమైతే ఐటెం సాంగ్స్ ‌కు రెడీ అంటోంది. ఇదిలా ఉంటే దర్శకుడు విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో  నాని హీరోగా తెరకెక్కుతోన్న ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ఐటెం సాంగ్ చేయనున్నట్టు సమాచారం. ఇది ఓకే చేయాలా వద్దా అనే డైలమోలో ఉందిట. పాపం రకుల్ మాత్రం ఎటూ తేల్చుకోలేని పరిస్థితులలో ఉందట.

    First published:

    Tags: Balakrishna, Jr ntr, Mahesh babu, NTR Biopic, Rakul Preet Singh, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు