సౌత్ ఇండియా(South India) స్టార్ యాక్ట్రెస్ గా కీర్తి సురేష్ దూసుకుపోతున్నారు. తెలుగు, తమిళ, మళయాళ భాషలతో భారీ చిత్రాలు చేస్తూ తనకు తిరుగులేదని నిరూపిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఆమె స్టార్ హారోలతో కూడా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది. కీర్తి సురేష్(Keerthy suresh) తో నటించడానికి టాలీవుడ్ లో పెద్ద హీరోలు కూడా సానుకూలంగా ఉన్నారు. తెలుగులో నేను శైలజ(Nenu Shailaja) సినిమాతో తెరపై తళుక్కున మెరిసిన ఈ భామ.. మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ మనసు దోచేసింది. క్యూట్ లుక్స్ తో కొంటె చూపులతో ఎంతో మందికి నిద్ర లేకుండా చేసింది. నేను శైలజ సినిమా తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది.
ఇక నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాతో కీర్తి జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకుంది. మహానటి సినిమాలో కీర్తి నటనతో కట్టిపడేసిందనే చెప్పాలి. అభినయ తార సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ నటన అద్భుతమనే చెప్పాలి. ఇక మహానటి సినిమా తర్వాత ఈ అమ్మడికి అవకాశాలు వెల్లువెత్తాయి. కుర్రహీరోలందరి సరసన నటిస్తుంది కీర్తి. ఈ క్రమంలో యంగ్ హీరో నితిన్ తో కలిసి రంగ్ దే సినిమాలో నటించింది. టాలీవుడ్ లో పెద్ద హీరోలు కూడా కీర్తి సురేష్ విషయంలో చాలా సానుకూలంగా ఉండటమే కాకుండా ఇతర భాషల్లో కూడా కొంత మంది అగ్ర దర్శకులు కీర్తి సురేష్ కు అవకాశం ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు.
ఇప్పుడు కీర్తి సురేష్ తెలుగులో రెండు మూడు సినిమాలు చేస్తుండగా తమిళంలో రెండు సినిమాలు అలాగే మలయాళంలో ఒక సినిమా.. కన్నడంలో ఒక సినిమాకు సంతకం చేసింది. తనకు వచ్చిన అవకాశాలను కీర్తి సురేష్ ఏ మాత్రం పోగొట్టుకునే ప్రయత్నం చేయడం లేదు. ఆమెకు కథ నచ్చితే సంతకం చేసేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కీర్తి సురేష్ యాంకర్ గా మారే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. కీర్తి సురేష్ తో ఒక ప్రముఖ ఛానల్ సంప్రదింపులు జరుపుతోందని.. త్వరలోనే ఆమె యాంకర్ గా మారే అవకాశాలున్నాయని అంటున్నారు.
ఆమె అందులో పూర్తిస్థాయిలో యాంకర్ కాకుండా వ్యాఖ్యాతగా చేసే అవకాశం ఉందని. ఆ షో లో ఆమె ఇంటర్వ్యూలు చేసే అవకాశాలున్నాయని.. అంటున్నారు. సినిమా పరిశ్రమకు సంబంధించిన దర్శకులు, నిర్మాతలు ఇంకా పెద్ద పెద్ద స్టార్లతో ఆమె ఇంటర్వ్యూలు చేయనున్నట్లు టాక్. ఈ ఛానల్ దాదాపు నాలుగు భాషల్లో ఇంటర్వ్యూ చేసే అవకాశం ఉందని.. దీనిలో కీర్తి సురేష్ కి వ్యాఖ్యాతగా అవకాశం ఇచ్చారని తెలుస్తోంది.
ఈ షో వారానికి రెండు నుంచి మూడు రోజల వరకు టెలికాస్ట్ అయ్యే విధంగా ప్రణాళికలు పూర్తి చేశారట. ఇలా మొత్తం ఎపిసోడ్ లు పూర్తి చేసేందుకు దాదాపు మూడు నెలల సమయం పడుతుందని సమాచారం. అయితే దీనికి కీర్తి సూరేష్ బాగానే పారితోషికం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో ఎపిసోడ్ కు రూ.15 లక్షల రెమ్యూనరేష్ తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Entertainment News in Telugu, Keerthy Suresh, Latest Cineme news in telugu, Telugu Cinema News, Telugu cineme videos, Telugu Movie News, Telugu movie ratings, Tollowood film news