కరోనా వైరస్‌ పై ఛార్మి వెకిలి వ్యాఖ్యలు.. మండిపడుతున్న నెటిజన్స్..

కరోనా వైరస్.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్. ఇప్పటికే కరోనా వైరస్ దెబ్బతో చైనాతో పాటు భారత్ సహా అన్ని దేశాలు గజ గజ వణికిపోతున్నాయి. తాజాగా కరోనా వైరస్‌పై ఛార్మి వెకిలి వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

news18-telugu
Updated: March 2, 2020, 6:26 PM IST
కరోనా వైరస్‌ పై ఛార్మి వెకిలి వ్యాఖ్యలు.. మండిపడుతున్న నెటిజన్స్..
Image : Charmy Kaur / Facebook)
  • Share this:
కరోనా వైరస్.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్. ఇప్పటికే కరోనా వైరస్ దెబ్బతో చైనాతో పాటు భారత్ సహా అన్ని దేశాలు గజ గజ వణికిపోతున్నాయి. కరోనా వైరస్ దెబ్బకు దేశాలకు దేశాలే ఆర్ధికంగా కుదేలవుతున్నాయి. ఈ వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక రంగం పడకేసింది. కరోనా వైరస్ కారణంగా చైనా ఆర్ధిక వృద్ధి మందగించింది. ఈ మందగమనం మన దేశాన్నికూడా తాకింది. తాజాగా ఈ వైరస్.. దేశ రాజధాని ఢిల్లీతో పాటు హైదరాబాద్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనిపై భారత ప్రభుత్వంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ఎమర్జన్సీ ప్రకటించింది. తాజాగా కరోనా వైరస్ దేశ రాజధానితో పాటు తెలంగాణలో నమోదు కావడంపై ఛార్మి ఏదో ఘనకార్యం సాధించినట్టుగా కరోనా వైరస్‌కు స్వాగతం అంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయడం పై పెద్ద దుమారమే రేగుతోంది. చాలా మంది నెటిజన్స్ అదేమైనా మంచి కార్యక్రమమా.. ఏదైనా శుభకార్యమా.. కరోనా వైరస్‌ను స్వాగతం పలకడానికి అంటూ మండిపడుతున్నారు. అసలు ఛార్మికి దిమాగ్ ఖరాబ్ అయిందా.. మైండ్ దొబ్బిందా అంటూ పలువురు నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.  మొత్తానికి కరోనా వైరస్ పై మతి లేని కామెంట్స్ చేసి అడ్డంగా బుక్కైంది ఛార్మి. తను చేసిన వ్యాఖ్యలపై నెటిజన్స్ మండిపడుతుండటంతో వెంటనే ఛార్మి కరోనా వైరస్‌పై తాను చేసిన ట్వీట్‌ను డీలిట్ చేసింది. ఐనా..అప్పటిగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మొత్తానికి ఛార్మి కరోనా వైరస్ పై పిచ్చిగా మాట్లాడి ఎరక్కపోయి.. అడ్డంగా ఇరుక్కుపోయింది.

Published by: Kiran Kumar Thanjavur
First published: March 2, 2020, 6:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading