బాలయ్య సాక్షిగా చిరు డైరెక్టర్‌తో ఛార్మి సరసాలు..

బాలయ్య సాక్షిగా చిరు డైరెక్టర్‌తో ఛార్మి సరసాలు.  ఛార్మి కౌర్ ప్రస్తుతం హీరోయిన్‌గా కెరీర్‌కు బ్రేక్ ఇచ్చిన తర్వాత దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో కలిసి పూరీ కనెక్ట్స్ అనే ప్రొడక్షన్ హౌస్ స్థాపించిన పూరీ జగన్నాథ్ తెరెక్కించే సినిమాలతో పాటు ఈ బ్యానర్‌లో తెరకెక్కే సినిమాల నిర్మాణ బాధ్యతలను దగ్గరుండి చూసుకుంటుంది. తాజాగా ఈమె..

news18-telugu
Updated: March 16, 2020, 4:11 PM IST
బాలయ్య సాక్షిగా చిరు డైరెక్టర్‌తో ఛార్మి సరసాలు..
దర్శకుడు జయంత్‌తో ఛార్మి పార్టీ (Twitter/Photo)
  • Share this:
బాలయ్య సాక్షిగా చిరు డైరెక్టర్‌తో ఛార్మి సరసాలు.  ఛార్మి కౌర్ ప్రస్తుతం హీరోయిన్‌గా కెరీర్‌కు బ్రేక్ ఇచ్చిన తర్వాత దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో కలిసి పూరీ కనెక్ట్స్ అనే ప్రొడక్షన్ హౌస్ స్థాపించిన పూరీ జగన్నాథ్ తెరెక్కించే సినిమాలతో పాటు ఈ బ్యానర్‌లో తెరకెక్కే సినిమాల నిర్మాణ బాధ్యతలను దగ్గరుండి చూసుకుంటుంది. ఒకప్పుడు హీరోయిన్‌గా ఎలాంటి  విజయాలను దక్కించుకుందో.. ఇపుడు నిర్మాతగా తనదైన శైలిలో రాణిస్తోంది. అప్పట్లో భీమినేని శ్రీనివాస రావు దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా నటించిన ‘నీతోడు కావాలి’ సినిమాతో హీరోయిన్‌గా పరిచమైన ఛార్మి కౌర్..  ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో కలిపి దాదాపు 60కి పైగా చిత్రాల్లో కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే కదా. అప్పట్లో తన అందాలతో ఎంతో మంది కుర్రకారును నిద్ర లేకుండా చేసింది. తాజాగా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్‌తో ఫుల్ ‌జోష్‌లో ఉన్న ఛార్మి..  ఇపుడు విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ మూవీ నిర్మిస్తోంది. మరోవైపు పూరీ జగన్నాథ్ కొడుకు హీరోగా నటిస్తోన్న ‘రొమాంటిక్’  చిత్ర నిర్మాణ  బాధ్యతలు చూస్తుంది. తాజాగా ఛార్మి.. ప్రముఖ దర్శకుడు జయంత్.సి.పరాన్జీతో కలిసి పెద్ద పార్టీ చేసుకుంది.

దర్శకుడు జయంత్  విషయానికొస్తే.. చిరంజీవి, నాగార్జున, బాలయ్య, వెంకటేష్, ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి అగ్ర కథానాయికలందరితో సినిమాలను తెరకెక్కించిన ట్రాక్ రికార్డు ఉంది. ఈయన దర్శకత్వంలో 16 ఏళ్ల క్రితం ఛార్మి ఒక సినిమా చేసింది. దీంతో మా ఇద్దరి స్నేహానికి 16 ఏళ్లు పూర్తైయిన సందర్భంగా ఈ పార్టీ ఇచ్చినట్టు తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది ఛార్మి. వీళ్లిద్దరు కలిసి 2004లో బాలకృష్ణ హీరోగా నటించిన ‘అల్లరి పిడుగు’ సినిమాలో తొలిసారి కలిసి పనిచేసారు. ఈ చిత్రం 2005లో విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఈ చిత్రంలోనే బాలీవుడ్ అగ్రనటి కత్రినా కైఫ్ కూడా హీరోయిన్‌గా నటించింది. మొత్తానికి అపుడెపుడో వీళ్లిద్దరు కలిసి చేసిన ‘అల్లరి పిడుగు’ సినిమాను గుర్తు పెట్టుకొని మరి జయంత్‌కు ఛార్మి పార్టీ ఇవ్వడం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.First published: March 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading