తమిళ్ స్టార్ హీరో విశాల్ (Vishal) త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా విశాల్ చెప్పాడు. అయితే విశాల్ లవ్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పాడు. విశాల్ ఇప్పటికి ఓ సారి ఎంగేజ్‌మెంట్ అయి పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు. నిజానికి విశాల్ 3 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకోవాల్సిన వాడు. కొన్నాళ్ళు వరలక్ష్మీ శరత్ కుమార్ తో ప్రేమాయణం నడిపిన విశాల్(Vishal Engagement) కు 2019లో నటి అనీషా అల్లారెడ్డితో నిశ్చితార్థం జరిగింది. అయితే అది పెళ్లి వరకు వెళ్లలేదు.
తెలుగు అమ్మాయి అనీషా రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ళు ఈమెతో ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. అయితే ఊహించని విధంగా వీరి పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ఆ తర్వాత అనీషా రెడ్డి పెళ్లి ఓ బిజినెస్ మెన్ తో కుదిరింది అనే వార్తలు వచ్చాయి. తర్వాత విశాల్ తో ఎంగేజ్మెంట్ టైం లో తీసుకున్న ఫోటోలు కూడా ఈమె డిలీట్ చేసింది.
ఇప్పుడు విశాల్ వయసు 44 ఏళ్ళు. ఇంకా ఇతను ఎందుకు పెళ్లి చేసుకోలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే నడిగర్ సంఘం అధ్యక్షుడుగా ఉన్న విశాల్ నడిగర్ సంఘం బిల్డింగ్ కట్టించిన తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానని తెలిపిన సంగతి తెలిసిందే. మరోపక్క విశాల్ ప్రేమలో పడినట్లు కూడా హింట్ ఇచ్చి షాకిచ్చాడు. ‘పెద్దలు కుదిర్చిన పెళ్లి మనకి కలిసి రాదు అని తెలిసింది. అందుకే ఇక లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నట్టు’ విశాల్ తెలిపాడు. ‘ప్రస్తుతం ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాను.. త్వరలో ఆ అమ్మాయి ఎవరు అన్న విషయం చెబుతానన్నాడు. ఆమెనే పెళ్లి చేసుకుంటాను’ అంటూ ఇటీవల ఓ సందర్భంలో విశాల్ చెప్పుకొచ్చాడు.
నిజంగానే విశాల్.. ప్రేమలో ఉన్నాడా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది . విశాల్ టాలీవుడ్‌లోనే కాదు కోలీవుడ్‌లో కూడా యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. విశాల్ సినిమాలకు తెలుగులో కూడా అనేకమంది అభిమానులు కూడా ఉన్నారు. యాక్షన్ సీన్స్‌లో డూప్ లేకుండా స్టంట్స్ చేస్తూ రిస్క్‌లు తీసుకోవడమేంటి విశాల్‌కు చాలా ఇష్టం. దానివల్లే ఎన్నోసార్లు తాను గాయాలపాలయ్యాడు కూడా. ఇటీవల తాను నటిస్తు్న్న 'లాఠీ' సినిమా షూటింగ్‌లో కూడా మరోసారి గాయపడ్డాడు విశాల్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hero vishal, Vishal