హీరోల్లో స్టార్ హీరోలు వేరయా... వారికుండే అభిమానులు కూడా వేరు. ఎలాంటి ప్రతిఫలం ఆశిచకుండా అభిమానులు చూపించే ప్రేమ, అప్యాయతలకు ఎంత పెద్ద హీరో అయినా సెల్యూట్ కొట్టాల్సిందే. కొందరు హీరోలు తమ అభిమానులను కలుసుకున్నప్పుడు వారు చేసే పనులు ఓ రేంజ్లో ట్రెండ్ అవుతాయి. అలా ట్రెండ్ అయిన ఓ సంగతి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇంతకీ అంతలా ఆశ్చర్యపోయే విషయమేమంటారా! ఓ సెల్ఫీ. అది ఓ స్టార్ హీరో తీసిన సెల్ఫీ కావడమే అసలు విషయం. ఇంతకీ ఆ సెల్ఫీలో ఏముందని అనుకుంటున్నారా? వివరాల్లోకెళ్తే.. తమిళ అగ్ర కథానాయకుల్లో హీరో విజయ్ ఒకరు. ఆయనకు కోలీవుడ్‌లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఆయన రీసెంట్గా నటించిన చిత్రం మాస్టర్. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను ఓ షెడ్యూల్‌ను నైవేలిలో చిత్రీకరించారు. అక్కడ తమ అభిమాన నటుడు, దళపతి విజయ్ షూటింగ్ జరుగుతుందని తెలిసింది. ఇక ఊరుకుంటారా! అందరూ అభిమానులు అక్కడికి వచ్చేశారు. అభిమానులను చూసి విజయ్ కామ్‌గా ఉండిపోలేదు. అందరితో ఫొటో దిగాలంటే చాలా సమయం పడుతుంది. అందుకని విజయ్ ఓ ప్లాన్ చేశాడు. దగ్గరలో షూటింగ్ కోసం ఉన్న బస్సుపైకి ఎక్కి అభిమానులందరూ తన ఫోన్లో కవర్ అయ్యేలా ఓ సెల్ఫీ తీసుకున్నాడు. ఆ ఫొటోను తన ట్విట్టర్లో పోస్ట్ చేసి థాంక్యూ నైవేలి అంటూ ఓ పోస్ట్ పెట్టాడు. ఆ ఫొటోను షేర్ చేసిన కొన్ని నిమిషాలకే తెగ వైరల్ అయ్యింది. ఈ ట్వీట్..145000 టైమ్స్ రీట్వీట్ చేశారు.
ఓ సెల్ఫీకి ఇంత రేంజ్లో క్రేజ్ రావడం నిజంగా గొప్ప విషయమే. ఓ దక్షిణాది స్టార్‌కు ఈ రేంజ్ ఫ్యాన్ బేస్ ఉండటం చాలా గొప్ప విషయమని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి. ప్రస్తుతం మాస్టర్ సినిమాను పూర్తి చేసిన విజయ్, ఇప్పుడు కొత్త సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ సినిమా చేస్తాడని అందరూ అనుకున్నప్పటికీ, చివరి నిమిషంలో మురుగదాస్ తప్పుకోవడంతో, పలువురు దర్శకుల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే ఇప్పుడు అట్లీ పేరు వినిపిస్తుంది. తెరి, మెర్సల్, బిగిల్ చిత్రాల తర్వాత నాలుగో సారి వీరి కాంబినేషన్లో సినిమా రూపొందుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Published by:Anil
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.