Home /News /movies /

HERO VIJAY RASHMIKA MANDANNA VAARASUDU MOVIE POSTERS RELEASED SLB

Vijay66: విజయ్ బర్త్ డే గిఫ్ట్ అదుర్స్.. ఈ సారి వారసుడు ఇలా!

Photo Twitter

Photo Twitter

Vijay Birth day: వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) హీరోగా రాబోతున్న కొత్త సినిమా వారసుడు. నేడు (జూన్ 22) విజయ్ పుట్టినరోజు సందర్భంగా సందర్భంగా రెండు కొత్త పోస్టర్స్ రిలీజ్ చేస్తూ విజయ్‌కి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మేకర్స్.

ఇంకా చదవండి ...
వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) హీరోగా రాబోతున్న కొత్త సినిమా వారసుడు. నిన్న (జూన్ 21) ఈ సినిమా టైటిల్ ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు మేకర్స్. విజయ్ 66వ మూవీగా ప్రేక్షకుల ముందుకు రావోతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ బ్యానర్లపై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే నేడు (జూన్ 22) విజయ్ పుట్టినరోజు సందర్భంగా మరో రెండు కొత్త పోస్టర్స్ రిలీజ్ చేస్తూ విజయ్‌కి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది చిత్ర బృందం.

తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి తమిళంలో ‘వారిసు’ (Varisu), తెలుగులో ‘వారసుడు’ (Vaarasudu) అనే టైటిల్‌ ఫిక్స్ చేశారు. విజయ్ క్రేజ్ దృష్ట్యా విడుదల చేసిన కాసేపట్లోనే ఈ సినిమా పోస్టర్స్ వైరల్ అయ్యాయి. నిన్న వదిలిన ఫస్ట్ లుక్‌ పోస్టర్‌లో హీరో విజయ్ పవర్‌ఫుల్‌గా కనిపించగా.. నేడు వదిలిన పోస్టర్స్‌లో సింపుల్ లుక్ లో ఆకట్టుకున్నారు. దీంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. మరోవైపు ఈ మూవీలో విజయ్ రోల్ అబ్బురపరచనుందని అంటున్నారు మేకర్స్.

ఈ సినిమాలో విజయ్ సరసన నేషనల్ క్రష్, క్రేజీ హీరోయిన్ రష్మిక మందన (Rashmika Mandanna) నటిస్తుండటం జనాల్లో మరింత ఆసక్తి పెంచింది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం సమయంలో తొలి రోజు షూటింగ్‌కి వచ్చిన రష్మిక మందన.. క్లాప్ కొట్టగానే విజయ్‌‌కి దిష్టి తీసి ఆయన పట్ల అభిమానాన్ని చాటుకున్నానని తెలిపింది. ఈ అమ్మడికి స్కూల్ ఏజ్ నుంచే విజయ్ అంటే చాలా ఇష్టమట. హీరోయిన్ అవుతుందా లేదా అనేది అప్పటికి తెలియదు కానీ తనకు దళపతి విజయ్ అంటే ఎంతో ఇష్టమని రష్మిక తెలిపింది. ఆయన లోని సింప్లిసిటీ తనకు బాగా నచ్చుతుందని రష్మిక తెలిపింది.

ఇకపోతే మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బాణీలు కడుతున్న ఈ సినిమాలో ప్రభు, శరత్ కుమార్, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, ప్రకాష్ రాజ్, జయసుధ, సంగీత, సంయుక్త తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అందమైన లొకేషన్స్‌లో శరవేగంగా జరుపుతున్నారు. 2023 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Published by:Sunil Boddula
First published:

Tags: Hero vijay, Rashmika mandanna, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు