HERO VIJAY RASHMIKA MANDANNA LATEST MOVIE TITLE AND FIRST LOOK REVEALED SLB
Vijay66: రష్మికతో విజయ్ రొమాన్స్.. టైటిల్ రివీల్ చేస్తూ కొత్త పోస్టర్
Photo Twitter
Thalapathy Vijay Rashmika Mandanna: జూన్ 22 అనగా రేపు విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందుగానే విజయ్ 66 ఫస్ట్ లుక్ పోస్టర్ వదులుతూ టైటిల్ రివీల్ చేశారు మేకర్స్. ఈ మేరకు విజయ్‌కి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) హీరోగా రాబోతున్న కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్ చేస్తూ సినిమా పోస్టర్ వదిలారు మేకర్స్. విజయ్ 66వ మూవీగా ప్రేక్షకుల ముందుకు రావోతున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జూన్ 22 అనగా రేపు విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందుగానే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వదులుతూ టైటిల్ రివీల్ చేశారు మేకర్స్. ఈ మేరకు విజయ్‌కి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి తమిళంలో ‘వారిసు’ (Varisu), తెలుగులో ‘వారసుడు’ (Vaarasudu) అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ట్విట్టర్ వేదికగా ఫస్ట్ లుక్ పోస్టర్స్ వదిలారు. దీంతో ఈ పోస్టర్స్ క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. ఈ చిత్రానికి ‘వారసుడు’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు నిజమయ్యాయి. ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో హీరో విజయ్ పవర్‌ఫుల్‌గా కనిపిస్తుండటం సినిమాపై ఆసక్తి రేపుతోంది. ఈ మూవీలో విజయ్ రోల్ అబ్బురపరచనుందని అంటున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అందమైన లొకేషన్స్‌లో శరవేగంగా జరుపుతున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన నేషనల్ క్రష్, క్రేజీ హీరోయిన్ రష్మిక మందన (Rashmika Mandanna) నటిస్తుండటం జనాల్లో మరింత ఆసక్తి పెంచింది. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బాణీలు కడుతున్న ఈ సినిమాలో ప్రభు, శరత్ కుమార్, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, ప్రకాష్ రాజ్, జయసుధ, సంగీత, సంయుక్త తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 2023 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుంచాలనేది మేకర్స్ ప్లాన్. కాగా ఈ మూవీపై విజయ్ ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు.
— Sri Venkateswara Creations (@SVC_official) June 21, 2022
కాగా.. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం సమయంలో తొలి రోజు షూటింగ్‌కి వచ్చిన రష్మిక మందన.. క్లాప్ కొట్టగానే విజయ్‌కి దిష్టి తీసి ఆయన పట్ల అభిమానాన్ని చాటుకున్నానని తెలిపింది. ఈ అమ్మడికి స్కూల్ ఏజ్ నుంచే విజయ్ అంటే చాలా ఇష్టమట. హీరోయిన్ అవుతుందా లేదా అనేది అప్పటికి తెలియదు కానీ తనకు దళపతి విజయ్ అంటే ఎంతో ఇష్టమని రష్మిక తెలిపింది. ఆయన లోని సింప్లిసిటీ తనకు బాగా నచ్చుతుందని రష్మిక తెలిపింది. స్టార్ స్టేటస్ ఉన్నప్పటికీ నిరాడంబరంగా ఉండే వ్యక్తి విజయ్ అని ఆమె చెప్పడం విశేషం.
Published by:Sunil Boddula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.