హోమ్ /వార్తలు /సినిమా /

Vaarasudu: రికార్డుస్థాయిలో విజయ్ వారసుడు బిజినెస్.. దిల్ రాజు డీలింగ్స్ అదుర్స్!

Vaarasudu: రికార్డుస్థాయిలో విజయ్ వారసుడు బిజినెస్.. దిల్ రాజు డీలింగ్స్ అదుర్స్!

Photo Twitter

Photo Twitter

Vijay- Dil Raju: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) హీరోగా రాబోతున్న కొత్త సినిమా వారసుడు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి తమిళంలో ‘వారిసు’ (Varisu) అనే టైటిల్ ఫిక్స్ చేయగా తెలుగులో వారసుడుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ సినిమా బిజినెస్ డీల్స్ బయటకొచ్చాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) హీరోగా రాబోతున్న కొత్త సినిమా వారసుడు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి తమిళంలో ‘వారిసు’ (Varisu) అనే టైటిల్ ఫిక్స్ చేయగా తెలుగులో వారసుడుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. విజయ్ 66వ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ బ్యానర్లపై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్ నెట్టింట వైరల్ గా మారింది.

కమర్షియల్ హంగులతో వంశీ పైడిపల్లి రూపొందిస్తున్న ఈ సినిమాపై జనాల్లో భారీ అంచనాలున్నాయి. పైగా రోజురోజుకు విజయ్ పాపులారిటీతో పాటు ఆయన సినిమాల మార్కెట్ రెట్టింపవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారసుడు సినిమా బిజినెస్ విషయమై దిల్ రాజు బెస్ట్ డీల్స్ చేస్తున్నారట. సినిమాపై హైప్ తీసుకొస్తూనే బిజినెస్ డీల్స్ సెట్ చేసుకుంటున్నారట.

ఈ వారసుడు సినిమా కోసం విజయ్ భారీ రెమ్మ్యూనరేషన్ తీసుకున్నారని తెలిసింది. మొత్తం 90 కోట్ల వరకు విజయ్ కి ముట్టిందని టాక్. దీనికి తోడు ఈ సినిమా అవుట్ పుట్ విషయమై ఎక్కడా వెనక్కితగ్గకుండా దిల్ రాజు భారీ సొమ్ము వెచ్చిస్తున్నారట. అందుకు తగ్గట్లుగానే ఇప్పుడు ఈ మూవీ బిజినెస్ జరుగుతోందని సినీ వర్గాల సమాచారం.

ఈ సినిమా నాన్ థియేట్రికల్, వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ కలుపుకుని మొత్తంగా 300 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ నడిచిందని తెలుస్తోంది. అయితే తెలుగులో మాత్రం స్వయంగా తానే ఈ సినిమా హక్కులు తీసుకొని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట దిల్ రాజు. ఏదిఏమైనా ఈ మూవీకి ఈ రేంజ్ డిమాండ్ నెలకొనడం విజయ్ అభిమానులను హుషారెత్తిస్తోంది.

ఈ సినిమాలో విజయ్ సరసన నేషనల్ క్రష్, క్రేజీ హీరోయిన్ రష్మిక మందన (Rashmika Mandanna) నటిస్తుండటం జనాల్లో మరింత ఆసక్తి పెంచింది. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బాణీలు కడుతున్న ఈ సినిమాలో ప్రభు, శరత్ కుమార్, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, ప్రకాష్ రాజ్ , జయసుధ, సంగీత, సంయుక్త తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 2023 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుంచాలనేది మేకర్స్ ప్లాన్. ఈ మూవీపై విజయ్ ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు.

First published:

Tags: Hero vijay, Tollywood, Vaarasudu Movie

ఉత్తమ కథలు