HERO VIJAY AND CRICKETER MS DHONI POSTER GOES CONTROVERSIAL VIRAL NR
Hero Vijay - MS Dhoni: ధోనిని ప్రధానిని చేసిన హీరో విజయ్ అభిమానులు.. వైరల్ పోస్టర్!
Hero Vijay - MS Dhoni: ఇండియన్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని గురించి అందరికీ తెలిసిందే. తన ఆటతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఎన్నో మ్యాచ్ లు, ఎన్నో పరుగులతో స్టార్ గా
Hero Vijay - MS Dhoni: ఇండియన్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని గురించి అందరికీ తెలిసిందే. తన ఆటతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఎన్నో మ్యాచ్ లు, ఎన్నో పరుగులతో స్టార్ గా
Hero Vijay - MS Dhoni: ఇండియన్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని గురించి అందరికీ తెలిసిందే. తన ఆటతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఎన్నో మ్యాచ్ లు, ఎన్నో పరుగులతో స్టార్ గా నిలిచాడు. ఎన్నో పురస్కారాలు కూడా అందుకున్నాడు. ఇక ఈయన కేవలం ఒక ఆటగాడిగా మాత్రమే దేశంలో నిలిచాడు. ఇక రాజకీయాలకు అసలే దూరంగా ఉంటాడు. అలాంటిది ఓ స్టార్ హీరో అభిమానులు ధోని ని ఏకంగా పీఎం చేసేశారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
తమిళ స్టార్ హీరో తలపతి విజయ్. ఈయన గురించి తెలుగు అభిమానులకు కూడా తెలిసిందే. ఇదిలా ఉంటే విజయ్ అభిమానులు ధోని ని పీఎం చేశారు. దీంతో విజయ్ కు, ధోని కి మధ్య ఉన్న సంబంధం ఏంటని.. పైగా విజయ అభిమానులు ధోని ని పీఎం గా ఎందుకు చేశారు అని ఎన్నో సందేహాలు ఎదురవుతున్నాయి. కాగా 2008లో తొలిసారిగా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ లాంచ్ చేసినప్పుడు హీరో విజయ్ ఆ టీమ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచాడు. అలా ధోనితో పరిచయం పెరిగిందని తెలుస్తుంది.
ఇక ప్రస్తుతం విజయ్ బీస్ట్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉండగా.. ఈ షూటింగ్ చెన్నైలోని గోకులం స్టూడియోలో జరుగుతుంది. ఇక అదే స్టూడియోలో క్రికెటర్ ధోని ఓ యాడ్ కోసం షూటింగ్ లో పాల్గొన్నాడు. దీంతో విజయ్, ధోని కాసేపు మాట్లాడుకోగా.. వారి ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
ఇక ఈ ఫోటోలను విజయ అభిమానులు మరింత వైరల్ గా మార్చారు. అది కూడా విజయ్ ను సీఎంగా, ధోని ని పీఎం గా మార్చారు. ఇక దీనికి సంబంధించిన పోస్టర్ లను తమిళనాడులో మధురైలో అంటించగా.. ఈ పోస్టర్ లను చూసిన ధోని అభిమానులు.. విజయ్ అభిమానులపై తెగ మండిపడుతున్నారు. రాజకీయాలకు దూరంగా ఉండే ధోనీని ఇలా ప్రచారం చేయడం సరైనది కాదు అంటూ వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట్లో కూడా హల్ చల్ చేస్తుంది.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.