ప్రస్తుతం నాని..గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘జెర్సీ’ సినిమా చేసాడు.ఈ సినిమాలో నాని రంజీ క్రికెటర్ పాత్రలో నటించాడు. పైగా అప్ కమింగ్ దర్శకున్ని నమ్మి రెండు భారీ ఫ్లాపుల తర్వాత నాని చేస్తున్న సినిమా ఇది. అన్నింటికీ మించి క్రికెట్ నేపథ్యంలో వస్తుంది ఈ చిత్రం. ఇప్పటికే విడుదలైన టీజర్,ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగింది. ఈ వేడుకకు విక్టరీ వెంకటేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
నేను క్రికెట్ అంటే ఇష్టం కాబట్టి ఇక్కడి రాలేదు. చాలా జెన్యూన్‌గా. ప్రేమగా ఇక్కడికి వచ్చానన్నారు. అంతేకాదు ఈసినిమా ఫస్ట్ లుక్ రిలీజైనపుడే ఈ సినిమాపై ప్రేమ కలిగిందన్నారు. ఇక దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఏమైతే చూపించాలనకున్నాడో అది క్లారిటీగా చూపించాడు. నాని ఇలాంటి సినిమా చేయడం చాలా బాగా అనిపించింది. ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరు ప్రేరణ పొందుతారన్నారు. ప్రతి ఒక్కరు లైఫ్‌లో స్ట్రగుల్ అవుతుంటారు. అలాంటపుడు ఎలాంటి రాజీ పడకుండా కష్టపడాలన్నారు. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఇది కేవలం సినిమా కాదు జీవిత పాఠాలు అని చూసిన ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారన్నారు. ఈ సందర్భంగా హీరో నానికి దర్శక, నిర్మాతలకు వెంకటేష్ ఈసినిమా సక్సెస్ కావాలని బెస్ట్ విషెస్ అందజేశారు.
మరోవైపు నాని మాట్లాడుతూ..వెంకటేష్ అవకాయ లాంటి వారని... ఆయనతో నటించడానికి ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానన్నారు. ఆయనతో వేదిక పంచుకోవాలని ఎప్పటి నుంచో అనకుంటున్నాను. ‘జెర్సీ’తో ఆ అవకాశం వచ్చింది. త్వరలో ఆయనతో కలిసి నటించే ఛాన్స్ వస్తే ఒదులుకోననని చెప్పారు నాని.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jersey movie review, Nani, Shraddha Srinath, Telugu Cinema, Tollywood, Venkatesh