"ఖైదీ", "మాస్టర్" వంటి సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించిన స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తాజాగా ఇప్పుడు "విక్రమ్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. లోకనాయకుడు కమల్ హాసన్ ఈ సినిమాలో హీరోగా నటించగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, మలయాళం స్టార్ ఫాహాధ్ ఫాసిల్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ అంచనాల మధ్య ఈ సినిమా జూన్ 3, 2022 న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో తమిళ్ స్టార్ హీరో సూర్య కూడా స్పెషల్ అపియరెన్స్ ఇచ్చాడు.
ఇక ఈ చిత్రంలో స్టార్ హీరో సూర్య ఒక క్యామియో రోల్ లో నటించాడు. అయితే క్యామియో రోల్ అంటే చివర్లో అలా వచ్చి ఇలా వెళ్లిపోతారు. ఈ పాత్రలకు ప్రత్యేకంగా క్యాస్టూమ్స్, లుక్ ఉండవు.. కానీ విక్రమ్ లో సూర్య పాత్ర కొద్దిగా సర్ ప్రైజింగ్ గా ఉంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో లాస్ట్ లో వచ్చిన సూర్య క్యామియో రోల్ తో ఇక సినిమా వేరే లెవెల్ లోకి వెళ్ళిపోయింది. అయితే ఈ స్పెషల్ రోల్ లో సూర్య ఎంత పవర్ ఫుల్ గా కనిపించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాను ఒక్కడే పైసా వసూల్ పెర్ఫామెన్స్ ని రోలెక్స్ గా అందించాడు. అయితే మరి ఇంత ఆదరణ వచ్చిన ఈ రోల్ కి సూర్య తీసుకున్న రెమ్యునరేషన్ పై అంతటా చర్చ జరుగుతుంది. అయితే ఈ రోల్ కి గాను సూర్య ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయలేదట. కమల్ మరో మాట లేకుండా ఒప్పుకొని వచ్చి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయాడట. అంతే కానీ అసలు రెమ్యునరేషన్ తీసుకోలేదని తెలుస్తుంది. దీంతో సూర్యపై ఆయన అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సూర్య గొప్ప నటుడే కాదు... గొప్ప వ్యక్తి అంటూ.. పొగిడేస్తున్నారు.
ఇక లేటెస్ట్ గా పాన్ ఇండియా సినిమా దగ్గర వచ్చి సాలిడ్ పాజిటువ టాక్ ని అందుకుంది“విక్రమ్” సినిమా. లోక నాయకుడు హీరోగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అలాగే ఫహద్ ఫాజిల్ లు కీలక పాత్రల్లో నటించారు. అయితే తెలుగులో కూడా మంచి రన్ లోకి వచ్చిన ఈ చిత్రంపై నటీనటులు పెర్ఫామెన్స్ లు అలాగే దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ బ్రిలియెన్స్ పై ఓ రేంజ్ లో ప్రశంసలు కురుస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kamal haasan, Surya, Vijay Sethupathi, Vikram Movie