సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు గుండెపోటుతో చనిపోయారు. వివరాల్లోకి వెళ్తే... కోలీవుడ్ ప్రముఖ నటుడు రామురోజ్ కన్నుమూశాడు. శుక్రవారం గుండెపోటు రావడంతో చెన్నైలోని రాజీవ్ గాంధీ హాస్పిటల్‌లో కుటుంబ సభ్యులు చేర్పించారు. అప్పటి నుండి ఆయన ఆస్పత్రిలోనే.. చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే పరిస్థితి విషమించడంతో సోమవారం తుదిశ్వాస విడిచాడు. 2008లో వచ్చిన ‘పూ’ సినిమాతో రామురోజ్‌కు మంచి క్రేజ్ వచ్చింది. దాంతో ఇండస్ట్రీలో ఈయనను ‘పూ’ రాము అంటూ పిలుస్తున్నారు.
దీంతో పాటు ఆయన ‘నీర్‌పరవై’, ‘పరియేరుమ్ పెరుమాల్’, ‘నీడునాల్‌వాడై’, ‘సూరరై పొట్రూ’ వంటి సినిమాలో కోలీవుడ్‌లో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే వచ్చిన సూర్య సినిమా ‘ఆకాశం నీ హద్దురా’ తో తెలుగు ప్రేక్షకులకు కూడా రామురోజ్ పరిచయం అయ్యారు. సూర్య తండ్రిగా మంచి నటనను కనబరిచాడు. ప్రస్తుతం ఈయన రెండు సినిమాలకు సైన్ కూడా చేశాడట. ఇక ఈయన మరణవార్త విన్న సీ.ఎం స్టాలిన్.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు.
స్ట్రీట్ అర్టిస్టు స్థాయి నుంచి నుండి గొప్ప నటుడిగా ఎదికి రామురోజ్ ప్రేక్షకులకు చేరువయ్యారు అంటూ స్టాలిన్ వెల్లడించాడు.హీరో ఉదయనిధి స్టాలిన్ హాస్పిటల్‌కు వెళ్ళి ఆయన భౌతిక కాయం వద్ద నివాళులు అర్పించారు. రాము అంత్యక్రియలు ఉరపక్కంలోని తన నివాసంలో మంగళవారం జరుగనున్నాయి. మరణ వార్త విన్న పలువురు కోలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం ప్రకటిస్తున్నారు. ఇండస్ట్రీ మంచి నటుడ్ని కోల్పోయిందంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hero suriya, Kollywood