ఉదయ్ కిరణ్ బయోపిక్ పై స్పందించిన సందీప్ కిషన్..

ఉదయ్ కిరణ్,సందీప్ కిషన్

గత రెండు రోజులుగా టాలీవుడ్‌లో ఉదయ్ కిరణ్ బయోపిక్‌కు సంబంధించిన చర్చ నడుస్తోంది. తాజాగా ఈ సినిమా సంబంధించి సందీప్ కిషన్ క్లారిటీ ఇచ్చారు.

  • Share this:
    గత రెండు రోజులుగా టాలీవుడ్‌లో ఉదయ్ కిరణ్ బయోపిక్‌కు సంబంధించిన చర్చ నడుస్తోంది. ఓ షార్ట్ ఫిల్మ్ దర్శకుడు సందీప్ కిషన్‌తో ఈ బయోపిక్‌‌ను తెరకెక్కించే సన్నాహాలు చేస్తున్నాడనే వార్తలు పుకార్లు షికార్లు చేశాయి. ఒకవేళ ఉదయ్ కిరణ్ బయోపిక్ తెరకెక్కిస్తే.. అందులో మెగా ఫ్యామిలీ హీరోలైన చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను విలన్లుగా చూపిస్తారా అనే డిస్కషన్స్ కూడా నడిచాయి. తాజాగా ఉదయ్ కిరణ్ బయోపిక్ విషయమై సందీప్ కిషన్ స్పందించాడు. ఉదయ్ కిరణ్ బయోపిక్‌కు సంబంధించి గత రెండు రోజులుగా అనేక పుకార్లు వినిపిస్తున్నాయి.మీడియాతో పాటు ప్రేక్షకులకు ఈ విషయమై క్లారిటీ ఇస్తున్నాను. ఉదయ్ కిరణ్ బయోపిక్ గురించి తనను ఎవరు సంప్రదించలేదు. ప్రస్తుతం తనకు ఎలాంటి బయోపిక్స్‌లో నటించే ఉద్దేశ్యం లేదన్నాడు. సందీప్ కిషన్ విషయానికొస్తే.. రీసెంట‌్‌గా ‘తెనాలి రామకృష్ణ’ సినిమాతో పలకరించిన సంగతి తెలిసిందే కదా.ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది.

    Published by:Kiran Kumar Thanjavur
    First published: