HERO SUMANTH HAS GIVEN SHOCK TO TROLLER AND HIS TWEET BECOME VIRAL MHN
Hero Sumanth: హీరో సుమంత్‌కి కోపం వచ్చింది.. అసలేం జరిగిందంటే..!
Hero Sumanth has given shock to troller and his tweet become viral
Hero Sumanth: హీరో సుమంత్ ఈరోజు ఓ ట్రోలర్‌కు ట్విట్టర్ వేదికగా అనుకోని షాక్ ఇచ్చాడు. ఇంతకీ ఆ ట్రోలర్ సుమంత్‌కు కోపం వచ్చేలా ఏం చేశాడో చూద్దాం. ఇప్పుడు సుమంత్ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది
నువ్వే కావాలి సినిమాలో హీరో ఎవరు? తరుణ్. తొలిప్రేమలో హీరో ఎవరు? పవన్ కల్యాణ్. మనసంతా నువ్వేలో హీరో ఎవరు? ఉదయ్‌కిరణ్. మరి ఇడియట్లో... రవితేజ. ఆనందం, గమ్యం.. దేశముదురు, నువ్వు వస్తావని, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్, అష్టాచమ్మా.... ఆగండాగండి. ఏంటి ఈ సినిమాల లిస్టు? ఇప్పుడు ఈ సినిమాల హీరోలతో పనేంటి? అని అనుకుంటున్నారా? ఈ సినిమాల్లో హీరోగా ఎవరిని అనుకున్నప్పటికీ, ఆఖరికి ఎవరు చేసినప్పటికీ,.... అన్నీ హిట్ సినిమాలే. అయితే ఇక్కడే ఉంది ఓ ట్విస్టు. ఈ సినిమాల కథలతో మేకర్స్ ఫస్ట్ అప్రోచ్ అయింది సుమంత్ నే అనేది ఓ వెర్షన్. దాన్నే ట్విట్టర్లోనూ పోస్ట్ చేశారు.
అయితే ఈ సినిమా పోస్ట్ ని చూసిన సుమంత్‌కి మాత్రం బాగా కాలినట్టుంది. అందుకే సదరు పోస్ట్ ని ట్యాగ్ చేసి ఒకింత అసహనంతోనే కామెంట్ చేస్తూరీపోస్ట్ చేశారు. ఒన్లీ నువ్వే కావాలి, దేశముదురు మాత్రమే నా వరకు వచ్చాయి. మిగిలిన కథలు, వాటి కాకరకాయలు నాకూ తెలియదు అని తేల్చి చెప్పేశారు సుమంత్. ఒకవేళ నువ్వేకావాలిలో తరుణ్‌కి బదులుగా నిజంగా సుమంత్ చేసి ఉంటే... సుమంత్ కెరీర్ ఎలా ఉండేది? పూరి చేతిలో పడి దేశముదురులో యాక్ట్ చేసి ఉంటే, మాస్ ఇమేజ్ బీభత్సంగా వచ్చి ఉండేది కదా... అంటూ నెట్టింట్లో ఎవరికి తోచిన డిస్కషన్స్ వాళ్లు పెట్టుకుంటున్నారు.
Pani leni puri, pls get your facts right🧐 Only Nuvve Kavali and Desamuduru of all those films you mentioned were offered to me https://t.co/wLGB7tzu2F
అయినా సుమంత్ ఈ మధ్య సినిమాలు చేస్తూనే ఉన్నారు. 2021లో సుమంత్‌కి ఫస్ట్ రిలీజ్ కపటధారి మాత్రం పెద్దగా కలిసిరాలేదు. ట్రాఫిక్ కాన్స్టేబుల్ డ్రస్‌లో ఫిట్‌గా కనిపించి, సినిమా మీద పాజిటివ్ బజ్ తీసుకురావడం వరకు సుమంత్ బాగానే రోల్ ప్లే చేశారు. సినిమాలో స్టఫ్ కూడా బాగానే ఉంది. నిజానికి క్లైమాక్స్ వరకూ ఎవరూ ట్విస్టులను కూడా ఊహించలేరు. కాకపోతే ఆ కాన్సెప్ట్ ని పబ్లిసిటీ చేసుకోవడంలో టీమ్ కాస్త ఫెయిలైంది. అన్నోన్ ఫేసులు ఎక్కువగా ఉండటం వల్ల కూడా దెబ్బపడింది. ఏదైనా నెక్స్ట్ మంచి హిట్ పడే వరకు మాత్రం సుమంత్‌లో ఆ ఫ్రస్ట్రేషన్ పోదేమో!