హోమ్ /వార్తలు /సినిమా /

Venkatesh: వెంకీ అలా చేస్తాడనుకోలేదు.. హీరో సుమన్ షాకింగ్ కామెంట్స్..!

Venkatesh: వెంకీ అలా చేస్తాడనుకోలేదు.. హీరో సుమన్ షాకింగ్ కామెంట్స్..!

నటుడు సుమన్ (Actor Suman)

నటుడు సుమన్ (Actor Suman)

హీరోలో మధ్య ఇగోలు అనేవి ఉంటాయి. అయితే తనకు తెలిసి హీరో వెంకటేష్ మాత్రం అలాంటి వాడు కాదన్నారు. హీరోగా తనకుండాల్సిన మర్యాద,గౌరవం ఉంటాయన్నారు.

టాలీవుడ్ హీరో సుమన్ (Suman) .. అప్పట్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ప్రస్తుతం పలు సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రలో నటించి మెప్పిస్తున్నారు. ఒకప్పుడు హీరోగా సుమన్ చేసినన్ని సినిమాలు మరే హీరో చేసి ఉండడు. ఆయన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు.. చేయని తప్పుకు జైలుకు వెళ్లడం, మళ్లీ తిరిగి రావడం.. హీరోగా నిలగోక్కుకోవడం ఇలా ఎన్నో కష్టాలను ఆయన అనుభవించారు. అయితే తాజాగా సుమన్ ఎఫ్3(F3 Movie)సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో వెంకటేష్ (Venkatesh) చేసిన పనికి షాక్ అయ్యానన్నారు.

ఎఫ్3లో వెంకటేష్‌ హీరో సుమన్ పాటకు స్టెప్పులేశారు. అప్పట్లో సుమన్ హీరోగా చిన్నల్లుడు (Chinna Alludu) సినిమా వచ్చింది. ఆ సినిమాలో కుర్రాడు బాబోయ్ అన్న పాటకు వెంకీ ఎఫ్3 సినిమాలో డాన్స్ చేసి అలరించారు. అయితే ఈ పాట వచ్చినప్పుడు థియేటర్లో జనం కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఈ పాటపై తాజాగా స్పందిస్తూ సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో డైరెక్టర్ శరత్ (Director Sharath) గారు ఈ పాటను కంపోజ్ చేశారు. నెంబర్ ఆఫ్ డ్రెస్సులు మార్చి మరీ ఆ పాటను అప్పట్లో షూట్ చేశారన్నారు సుమన్. ఆ పాట ఇప్పుడు చూస్తే.. చాలా ఆనందంగా ఉందన్నారు. హీరోలో మధ్య ఇగోలు ఉంటాయి.. కానీ వెంకటేష్ మాత్రం అలాంటి వాడు కాదు తనకు తెలిసి. హీరోగా తనకుండాల్సిన మర్యాద,గౌరవం ఉంటాయన్నారు. వెంకీ చాలా ఓపెన్‌గా ఉంటాడు. ఫ్లెక్సీబుల్‌గా ఉంటాడు. వెంకటేష్ చాలా మంచి మనిషి అన్నారు సుమన్. అన్నీ బావుంటే... వెంకీ ఏదైనా చేస్తాడన్నారు. ఆయన ఎక్కడ డిగ్రేడ్ చేయకుండా చేస్తాడన్నారు.

థియేటర్లలో సుమన్ పాటకు వెంకీ స్టెప్పులేయగానే.. అందరూ విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేశారన్నారు. అయితే తాను ఇంకా ఈ సినిమా థియేటర్లో చూడలేదన్నారు. కానీ తనకు ఈ పాట గురించి చాలామంది చెప్పారన్నారు. ఆ విషయం వినగానే ముందు షాక్ అయ్యానన్నారు. పాటను మళ్లీ గుర్తుకు తెచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. వెంకటేష్‌కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు సుమన్(Suman). పాత మెమరీస్‌కు మళ్లీ తీసుకెళ్లాలన్నారు. ఆడియన్స్ కూడా దీన్ని ఆమోదించడం పట్ల వారికి కూడా కృతజ్ఞతలు తెలిపారు.

ఇక సుమన్ హీరోగా నటించిన ‘చిన్న అల్లుడు’ 1993 లో శరత్ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో సుమన్, రంభ, ఆమని, దాసరి నారాయణరావు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని గోపి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై చలసాని గోపి నిర్మించాడు. ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు. వేటూరి సుందరరామ్మూర్తి పాటలు రాయగా ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర పాటలు పాడారు.

First published:

Tags: F3 film, F3 Movie, Suman, Venkatesh

ఉత్తమ కథలు