హోమ్ /వార్తలు /సినిమా /

Simbu - Karthika: వైరల్ అవుతున్న శింబు, కార్తీక ఫోటోషూట్.. సినిమా అలా ఆగిపోవడానికి తమన్నానే కారణమా?

Simbu - Karthika: వైరల్ అవుతున్న శింబు, కార్తీక ఫోటోషూట్.. సినిమా అలా ఆగిపోవడానికి తమన్నానే కారణమా?

Simbu - Karthika

Simbu - Karthika

Simbu - Karthika: 2011లో కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'రంగం'. ఈ సినిమా తమిళం లో 'కో' పేరుతో విడుదల కాగా.. ఆ తర్వాత తెలుగులోకి డబ్బింగ్ చేశారు.

Simbu - Karthika: 2011లో కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'రంగం'. ఈ సినిమా తమిళం లో 'కో' పేరుతో విడుదల కాగా.. ఆ తర్వాత తెలుగులోకి డబ్బింగ్ చేశారు. ఈ సినిమాలో జీవా, కార్తీకా నాయర్ నటీనటులుగా నటించారు. పొలిటికల్ డ్రామాలో ఈ సినిమాను తెరకెక్కించారు. అంతే కాకుండా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే ఇందులో మరో హీరో శింబు ఉన్నాడు ఏంటి అనుకుంటున్నారా..


మొదటగా ఈ సినిమాకు హీరోగా శింబు ను తీసుకున్నారట. ఇక కొన్ని రోజుల్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందనే సందర్భంలో శింబు, కార్తీకా లపై బాంబు దాడిలో సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఫోటో షూట్ కూడా చేశారట. ఇక ఒరిజినల్ షూట్ చేసే సమయంలో శింబు ఈ సినిమా నుంచి తప్పుకున్నాడట. ఇక వెంటనే డైరెక్టర్ ఆనంద్ ఈ సినిమాకు జీవాని హీరోగా తీసుకున్నాడట. ఇక ఈ సినిమా విడుదలైన పదేళ్లు అవ్వడంతో ఈ ఫోటోలను ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారాయి.


ఇక శింబు ఈ సినిమా నుండి తప్పుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయని తెలుస్తున్నాయి. డైరెక్టర్ తో కొన్ని విషయాలలో విభేదాలు రావడంతో తప్పించుకున్నాడని.. అంతేకాకుండా హీరోయిన్ కార్తీకా తనకు సరైన జోడి కాదని, ఆమె స్థానంలో తమన్నా ను పెట్టమని కోరగా.. ప్రస్తుతమున్న బడ్జెట్ తమన్నాకు సరిపోదని.. తనకు భారీ పారితోషకం అందించాలని చెప్పడంతో.. శింబు ఈ సినిమాను వదులుకున్నాడని తెలుస్తుంది.


ఇక ఈ సినిమా తర్వాత డైరెక్టర్ ఆనంద్ కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు. ఇక ఆయన మళ్లీ శింబుతో కలిసి ఓ సినిమా చేయాలని అనుకోని కథ కూడా వినిపించారట. దీంతో శింబు కూడా ఓకే చెప్పడంతో ఈ సినిమా గురించి త్వరలోనే ప్రకటించాలని అనుకోగా అనారోగ్యంతో ఆనంద్ మరణించారు.

First published:

Tags: Hero simbhu, Heroine karthika, Jeeva, K v anand, Photoshoot, Rangam telugu film, Social Media, Tamil ko

ఉత్తమ కథలు