Siddharth : లండన్‌లో హీరో సిద్ధార్థ్‌కు సర్జరీ.. అందోళనలో అభిమానులు..

Siddharth Photo :Twitter

Siddharth : తమిళ హీరో సిద్ధార్థ్‌కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన తెలుగులో చాలా చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం మహా సముద్రంలో నటిస్తున్నారు. అది అలా ఉంటే ఆయన ఆరోగ్య కారణాల రిత్యా లండన్‌లో సర్జరీ చేయించుకున్నారని తెలుస్తోంది. దీంతో అభిమానులు అందోళన చెందుతున్నారు.

 • Share this:
  తమిళ హీరో సిద్ధార్థ్‌ (Siddharth)కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన తెలుగులో చాలా చిత్రాల్లో నటించారు. అందులో చాలా వరకు మంచి విజయాలను పొందాయి. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన బొమ్మరిల్లు సినిమా సిద్ధార్థ్‌కు మంచి పాపులారిటీని తెచ్చింది. అయితే ఆ మధ్య ఆయన నటించిన సినిమాలేవి పెద్దగా ఆకట్టుకోపోవడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. ఏడేళ్ల తర్వాత సిద్ధార్థ్ తెలుగులో మహా సముద్రం అనే సినిమాలో నటిస్తున్నారు. ఇక అది అలా ఉంటే సిద్ధార్థ్ అరోగ్యం ప్రస్తుతం బాగా లేదని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం సిద్ధార్థ్ లండన్ లో ఉన్నారని, అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారని సమాచారం. అక్కడి ఓ హాస్పిటల్ లో సర్జరీ చేయించుకున్నారని తెలుస్తోంది. అయితే ఆయనకు వచ్చిన సమస్య ఏమిటి?.. ఏ సర్జరీ చేయించుకున్నారు అనే విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు మాత్రం ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

  ఇక సిద్దార్థ్ నటిస్తున్న మహా సముద్రం విషయానికి వస్తే.. ఈ సినిమాను ఆర్ఎక్స్ 100 దర్శకుడు ఫేమ్ అజయ్ భూపతి (Ajay bhupathi) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ‘మహా సముద్రం’  (Maha Samudram) లవ్ అండ్ యాక్షన్ జానర్‌లో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా (Sharwanand) (Siddharth) నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది.

  Vijay Devarakonda : పుట్టిన రోజు సందర్భంగా తల్లికి అపురూపమైన బహుమతిని ఇచ్చిన విజయ్ దేవరకొండ..

  తెలుగు తెరపై ఎప్పుడూ చూడని భావోద్వేగాలతో మా ‘మహా సముద్రం’ తెరకెక్కిందని, ఆర్‌.ఎక్స్‌.100’ మించి ఈ సినియా ఉండబోతుందని దర్శకుడు తెలిపారు. ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో అదరగొడుతోంది. ఇప్పటికే మహా సముద్రం ట్రైలర్ మూడు మిలియన్ పైగా వ్యూస్‌తో ట్రెండింగ్ అవుతోంది.

  ట్రైలర్‌లో ముఖ్యంగా కొన్ని డైలాగ్స్ తెగ ఆకట్టుకుంటున్నాయి. సముద్రం చాలా గొప్పది మామ. తనలో చాలా రహస్యలు దాచుకుంటుంది. నవ్వుతూ కనిపించనంత మాత్రానా బాగున్నట్టు కాదు అర్జున్ అంటూ హీరోయిన్ చెప్పే డైలాగులు, మీరు చేస్తే నీతి.. నేను చేస్తే బూతా అంటూ సిద్ధార్థ్ చెప్పే మాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమాను ఎమోషనల్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు దర్శకుడు అజయ్ భూపతి.

  Bigg Boss 5 Telugu Uma Devi: మాట కటువు కానీ మనసు వెన్న.. క్యాన్సర్ పేషెంట్‌కు పారితోషికం దానం చేసిన అర్ధపావు భాగ్యం

  ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 14వ తేదీన (Maha Samudram release for dussehra) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చగా.. జగపతిబాబు, రావు రమేష్, గరుడ రామ్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. శర్వానంద్, సిద్ధార్థ్‌ల సరసన అదితీ రావు హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్ (Aditi Rao Hydari), (Anu Emmanuel)నటిస్తున్నారు.  మ‌హా స‌ముద్రం సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఆగష్టు 19న విడుదల కావాల్సి ఉంది. కరోనా పరిస్థితుల్లో విడుదల వాయిదా పడింది. కాగా ఈ మధ్య కరోనా కేసులు తగ్గడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమాల విడుదలకు అనుమతి ఇవ్వడంతో ఇప్పటికే పలు సినిమాలు విడుదలైయ్యాయి. ఈ నేపథ్యంలో మహా సముద్రం దసరా కానుకగా అక్టోబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.
  Published by:Suresh Rachamalla
  First published: