తమిళ హీరో సిద్ధార్థ్ (Siddharth)కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన తెలుగులో చాలా చిత్రాల్లో నటించారు. అందులో చాలా వరకు మంచి విజయాలను పొందాయి. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన బొమ్మరిల్లు సినిమా సిద్ధార్థ్‌కు మంచి పాపులారిటీని తెచ్చింది. అయితే ఆ మధ్య ఆయన నటించిన సినిమాలేవి పెద్దగా ఆకట్టుకోపోవడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ఆయన మహా సముద్రం అనే సినిమాలో నటిస్తున్నారు. ఇక అది అలా ఉంటే.. ఆయన తాజాగా చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. “మోసం చేసేవాళ్లు ఎప్పుడూ బాగుపడరు.. చిన్నప్పుడు నేను స్కూల్లో టీచర్ దగ్గర మొదట నేర్చుకుంది అదే…. మరి మీరేం నేర్చుకున్నారు..? ” అంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ సిద్దార్థ్ ఎవరి గురించి చేశారా అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ఈ ట్వీట్ పట్ల నెటిజన్లు అనేక రకాలుగా స్పందిస్తున్నారు.
ముఖ్యంగా కొందరు మాత్రం ఈ ట్వీట్ సమంతను ఉద్దేశించే అయ్యి ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. గతంలో సిద్ధార్థ్, సమంతలు కలిసి నటించారు. అంతేకాదు ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందని అప్పట్లో ఓ రూమర్ హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ ఈ ట్వీట్ చేసి ఉంటారని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. అయితే ఆయన చేసిన ఆ ట్వీట్ సమంతను ఉద్దేశించేనా.. లేక మరేదైనా అనే విషయంలో కొంత క్లారిటీ రావాల్సి ఉంది.
One of the first lessons I learnt from a teacher in school...
"Cheaters never prosper."
What's yours?
— Siddharth (@Actor_Siddharth) October 2, 2021
ప్రస్తుతం సిద్దార్థ్ హైదారాబాద్‌లోనే ఉన్నారు. ఆయన తన తాజా సినిమా ‘మహా సముద్రం’ కోసం డబ్బింగ్ చెబుతున్నారు. . ఇక అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహా సముద్రం’ మూవీలో శర్వానంద్ తో కలిసి నటిస్తున్నాడు సిద్ధార్థ్ . ఈ సినిమా అక్టోబర్ 14న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల అవుతోంది.
ఇక ఇదే సినిమాలో ఓ ఫైట్ సీన్ చేస్తుండగా.. ఆయన గాయపడ్డారు. సర్జరీ కోసం లండన్ వెళ్లారనే వార్తల నేపథ్యంలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఆయన తన ట్వీట్లో పేర్కోంటూ.. సర్జరీ నుంచి ప్రస్తుతం కోలుకున్నట్లు వెల్లడించారు.
ఏడేళ్ల తర్వాత సిద్ధార్థ్ తెలుగులో మహా సముద్రం సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఆర్ఎక్స్ 100 దర్శకుడు ఫేమ్ అజయ్ భూపతి (Ajay bhupathi) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ‘మహా సముద్రం’ (Maha Samudram) లవ్ అండ్ యాక్షన్ జానర్లో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా (Sharwanand) (Siddharth) నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది.
MAA Elections : ఢీ అంటే ఢీ అంటోన్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు.. అభ్యర్థుల తుది జాబితా ఇదే..
తెలుగు తెరపై ఎప్పుడూ చూడని భావోద్వేగాలతో మా ‘మహా సముద్రం’ తెరకెక్కిందని, ఆర్.ఎక్స్.100’ మించి ఈ సినియా ఉండబోతుందని దర్శకుడు తెలిపారు. ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో మంచి ఆదరణ పొందుతోంది.
ట్రైలర్లో ముఖ్యంగా కొన్ని డైలాగ్స్ తెగ ఆకట్టుకుంటున్నాయి. సముద్రం చాలా గొప్పది మామ. తనలో చాలా రహస్యలు దాచుకుంటుంది. నవ్వుతూ కనిపించనంత మాత్రానా బాగున్నట్టు కాదు అర్జున్ అంటూ హీరోయిన్ చెప్పే డైలాగులు, మీరు చేస్తే నీతి.. నేను చేస్తే బూతా అంటూ సిద్ధార్థ్ చెప్పే మాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమాను ఎమోషనల్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు దర్శకుడు అజయ్ భూపతి.
ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 14వ తేదీన (Maha Samudram release for dussehra) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చగా.. జగపతిబాబు, రావు రమేష్, గరుడ రామ్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. శర్వానంద్, సిద్ధార్థ్‌ల సరసన అదితీ రావు హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్ (Aditi Rao Hydari), (Anu Emmanuel)నటిస్తున్నారు.
మహా సముద్రం సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఆగష్టు 19న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా పరిస్థితుల్లో విడుదల వాయిదా పడింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Naga Chaitanya, Naga Chaitanya Samantha Divorce, Samantha Ruth Prabhu, Tollywood news