హోమ్ /వార్తలు /సినిమా /

పాన్ ఇండియా బిల్డప్ అవసరం లేదు... స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు

పాన్ ఇండియా బిల్డప్ అవసరం లేదు... స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు

పాన్ ఇండియా సినిమాలు

పాన్ ఇండియా సినిమాలు

సౌత్ సినిమాల గురించి చర్చించుకుంటున్న వేళ... సౌత్ హీరో.. సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాన్ ఇండియా అనే పదమే నాన్సెన్స్ అన్నాడు. దీంతో అతడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి.

  సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒకే మాట వినిపిస్తోంది... అదే పాన్ ఇండియా. పాన్ ఇండియా సినిమా,పాన్ ఇండియా స్టార్స్,పాన్ ఇండియా డైరెక్టర్స్ ఇలా ఎవర్నీ చూసినా ఇదే విషయంపై మాట్లడుకుంటున్నారు. బాహుబలి,పుష్ప,ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ సినిమాల తర్వాత ఇప్పుడు ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ రచ్చ జరుగుతోంది. పాన్ ఇండియా సినిమాలతో సౌత్ వర్సెస్ నాత్‌గా మారింది. కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు సౌత్ సినిమాలను సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు బాలీవుడ్ ఏం తక్కువ కాదంటూ కామెంట్లు చేస్తున్నారు. చాలామంది సెలబ్రిటీలు ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలపై మాట్లాడారు. తాజాగా మరో హీరో పాన్ ఇండియా అనే పదంపైనే కీలక వ్యాఖ్యలు చేశాడు. అతనెవరో కాదు.. బొమ్మరిల్లు సినిమాతో అమ్మాయిల మనసు దోచుకున్న హీరో సిద్ధార్థ.

  పాన్-ఇండియన్ అనేది చాలా అగౌరవకరమైన పదమన్నాడు సిద్ధార్థ. పాన్-ఇండియన్ అనేది నాన్సెన్స్.. ఇక్కడ నిర్మించే అన్ని సినిమాలు భారతీయ చిత్రాలే.. అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు మాత్రం పాన్ ఇండియా మూవీ వచ్చిందా..? 15 సంవత్సరాల క్రితం పాన్-ఇండియన్ సినిమా రాలేదా..? అంటూ ప్రశ్నించాడు. తన బాస్ మణిరత్నం ‘రోజా’ అనే సినిమా తీశారు. ఈ సినిమా భారతదేశంలోని ప్రతి ఒక్కరూ చూసారు. చూడని వారు అంటూ ఎవరూ లేరన్నాడు సిద్ధార్థ.

  ఇక ఇటీవలే తన స్నేహితులు ‘కెజిఎఫ్’ సినిమా తీశారని... అది ఒక భారతీయ సినిమా.. అని దానిని చూసి గర్వపడుతున్నానని చెప్పుకొచ్చాడు సిద్ధు. సినిమాను ఎవరికి నచ్చిన భాషలో చూసే హక్కు ప్రేక్షకులకు ఉంటుందన్నాడు. ఇది భారతీయ సినిమా .. కన్నడ పరిశ్రమ ఈ సినిమాను తయారుచేసింది. అస్సలు పాన్ ఇండియా.. పాన్ ఇండియా అని ఒకటే రచ్చ చేస్తున్నారు. నాకు తెలిసి పాన్ ఇండియా అనే పదమే తీసివేయాలి. దాని ప్లేస్ లో భారతీయ సినిమా అని పెట్టాలి.. అందరు అలాగే పిలవాలి అని చెప్పుకొచ్చాడు సిద్ధార్థ. సినిమాలను పాన్ ఇండియా అని కాకుండా.. ఏ భాషలో రూపొందిందో ఆ భాషతోనే పిలవాలన్నాడు. తమిళం.. తెలుగు సినిమాల్లో స్టార్డమ్ సంపాదించి బాలీవుడ్ కు వెళ్లినా తనను ఎవరూ సౌత్ ఇండియన్ యాక్టర్ అనరని కేవలం సౌత్ యాక్టర్ అని మాత్రమే అంటారన్నాడు సిద్దు.

  ఒక సినిమా గొప్పగా రావాలంటే ఎంతోమంది టెక్నీషయన్లు కావాలి. వారికి భాషా భేదం ఉండదు.. తమిళ్ టెక్నీషయన్లు హిందీలో వర్క్ చేయడం లేదా..? తెలుగు నిర్మాతలు హిందీలో సినిమాలు తీయడం లేదా..? కంటెంట్ బావుంటే ఏ సినిమా అయినా,. ఏ భాషలోనైనా హిట్ అవుతుంది. దానికి పాన్ ఇండియా అని చెప్పి బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం లేదు” అని చెప్పుకొచ్చాడు. ఏదీ ఏమైనా మరోసారి సిద్దు చేసిన తాజా వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Bommarillu Bhaskar, Siddharth

  ఉత్తమ కథలు