Home /News /movies /

HERO SHIVAJI COMMENTS ON WHY HE AWAY FROM MOVIES SB

Shivaji: ఆ బస్సు ఘటనతోనే సినిమాలకు దూరం.. శివాజీ షాకింగ్ కామెంట్స్

హీరో శివాజీ

హీరో శివాజీ

నిజాయితీగా ఉండేవాడిని చూడటానికి మనం ఇష్టపడతామన్నారు శివాజీ. అందువల్లే పోలీస్ కథలు చాలా వరకు హిట్టవుతాయని శివాజీ తెలిపారు.

    టాలీవుడ్ ప్రముఖ నటుడైన హీరో శివాజీ.. ఈ మధ్య ఎక్కడ కనిపించడం లేదు. ఓ టైంలో వరుసగా సినిమాల్లో కనిపించిన ఆ తర్వాత మాత్రం సినిమాలకు దూరమయ్యారు.   అయితే ఆ తర్వాత రాజకీయాల్లో శివాజీ ప్రత్యక్షమయ్యారు. పలువురు నాయకులపై కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా అల్లూరి టీజర్ లాంఛ్ ఈవెంట్ లో శివాజీ పాల్గొన్నారు. బాల్యం నుంచి నాకు అల్లూరి సీతారామరాజు అంటే సూపర్ స్టార్ కృష్ణ అని శివాజీ తెలిపారు.

    సూపర్ స్టార్ కృష్ణను చూసి అల్లూరి సీతారామరాజు అంటే ఆయనలానే ఉంటారా అని అనుకునేవాడినని శివాజీ చెప్పుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీకి బెక్కెం వేణుగోపాల్ చాలామందిని పరిచయం చేశారని శివాజీ కామెంట్లు చేశారు. అయితే ఆయనను నేనే ఇండస్ట్రీకి పరిచయం చేశానని గర్వంగా చెప్పగలనని శివాజీ చెప్పుకొచ్చారు. బెక్కెం వేణుగోపాల్ తీసే సినిమా కథలను నాకు చెబుతారని కొన్ని కథలు వద్దని చెబుతానని శివాజీ తెలిపారు. ఒక సినిమా కథ చెబితే వద్దని చెప్పినా తీసి వేణుగోపాల్ చేతులు కాల్చుకున్నాడని హీరో శివాజీ అన్నారు.



    అల్లూరి కథను మాత్రం విన్న వెంటనే సంతోషంగా చేసుకోవచ్చని చెప్పానని తెలిపారు. గతంలో పోలీస్ కథలతో చాలా సినిమాలు వచ్చినా ఈ సినిమా కొత్తదనంతో ఉంటుందని శివాజీ కామెంట్లు చేయడం గమనార్హం. నిజాయితీగా ఉండేవాడిని చూడటానికి మనం ఇష్టపడతామని అందువల్లే పోలీస్ కథలు చాలా వరకు హిట్టవుతాయని శివాజీ చెప్పుకొచ్చారు.

    పాలెం బస్సు సంఘటన వల్ల తాను సినిమాలకు దూరమయ్యానని శివాజీ తెలిపారు. అలా జరగకపోతే పదేళ్లలో పది పదిహేను సినిమాలలో నటించి రూ.కోట్లు సంపాదించేవాడినని శివాజీ కామెంట్లు చేశారు. శివాజీ చెప్పిన విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Shivaji, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు