హోమ్ /వార్తలు /movies /

కరోనా పై పోరాటంలో నేను సైతం అంటూ సాయి కుమార్ ఫ్యామిలీ విరాళం.

కరోనా పై పోరాటంలో నేను సైతం అంటూ సాయి కుమార్ ఫ్యామిలీ విరాళం.

ప్రస్తుతం మన దేశంతో పాటు ప్రపంచం కరోనా అనే పెను సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. కరోనా పై పోరాటంలో భాగంగా సాయి కుమార్ తన కుమారుడు సోదరుడు రవి శంకర్‌తో కలిసి కరోనా క్రైసిస్ ఛారిటీతో పాటు తెలుగు డబ్బింగ్ యూనియన్‌కు తమ వంతు విరాళం అందజేసారు.

ఇంకా చదవండి ...

    ప్రస్తుతం మన దేశంతో పాటు ప్రపంచం కరోనా అనే పెను సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఈ మహామ్మారిని ఎదుర్కొవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు బాధ్యతగా లాక్‌డౌన్ ప్రకటించి కరోనా వైర‌స్‌ను కట్టడి చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ లాక్‌డౌన్ కారణంగా చాలా మంది నిరుపేదలకు పనిలేకుండా పోయింది. వారిని ఆదుకోవడానికి సినీ, క్రీడా, వాణిజ్య ప్రముఖలు ముందుకు వస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా పనిలేకుండా పోయిన తెలుగు సినిమా ఇండస్ట్రీ కార్మికుల కోసం కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ చారిటీకి చాలా మంది నటీనటులు, దర్శకులు, నిర్మాతలు తమ వంతు బాధ్యతగా విరాళాలు అందజేస్తున్నారు. తాజాగా డైలాగ్  కింగ్ సాయికుమార్ ఆయన కుమారుడు హీరో ఆది సాయి కుమార్ కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం రూ. 5 లక్షల 4 రూపాయలను విరాళంగా అందజేసారు. అలాగే డబ్బింగ్ యూనియన్ అసోసియేషన్‌కు కూడా సాయి కుమార్ తన వంతుగా రూ.1 లక్ష 8 రూపాయలను విరాళంగా అందజేయడం జరిగింది. మరోవైపు సాయికుమార్ సోదరుడు బొమ్మాళీ రవిశంకర్ తన వంతుగా రూ. లక్ష రూపాయలను విరాళం అంజేసారు. మొత్తంగా సాయి కుమార్ ఫ్యామిలీ రూ. 7 లక్షల 12 రూపాయాలను విరాళం అందజేయడం జరిగింది.

    First published:

    ఉత్తమ కథలు