మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో చిరు మేనల్లుడు సాయిథరమ్ తేజ్ ఒకరు. ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాతో అందరి మనసుల్లో అభిమానం సంపాదించుకున్నాడు. ఈ తర్వాత వరుసగా ఏడు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో సాయిధరమ్ తేజ్ పని అయిపోయింది అనుకున్నారు. అయితే అదే సమయంలో చిత్రలహరి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.ప్రస్తుతం సాయి మారుతి దర్శకత్వంలో ‘ప్రతిరోజూ పండగే’ సినిమా చేస్తున్నారు. అలాగే ‘సోలో బతుకే సో బెటర్’ అనే టైటిల్‌తో ఓ సినిమాను ఖరారు చేసినట్లు తెలుస్తుంది.
అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సాయి ధరమ్ తేజ్ ఉంటారు. అభిమానులు మెసేజ్‌లకు రిప్లై ఇస్తూ ఉంటాడు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ నెటిజన్ ఏరా సినిమాలో కామెడీ ఈ రేంజ్లో ఉంటుందా? అంటూ సాయిని ఏకవచనంతో పిలుస్తూ కామెంట్ చేశాడు. అయితే ఆ మెసేజ్ కు కోపడగించుకోకుండా అంతే సరదాగా రిప్లై ఇచ్చారు సాయి ధరమ్ తేజ్.
‘లేదురా దీనికి వెయ్యి రెట్లు ఎక్కువగా ఉంటుంది అంటూ’ రిప్లై ఇచ్చాడు. దీంతో షాక్ అయిన అభిమాని బ్రహ్మానందం ఫోటో పెట్టాడు. దానికి కూడా బ్రహ్మానందం ఫోటోను రిప్లైగా పెట్టాడు సాయి ధరమ్ తేజ్. చివరకు ఏదో తెలియక కామెంట్ చేశాను అన్న గుడ్ లక్ అని చెప్పేశాడు నెటిజన్. ఈ కన్వర్జేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Era cinemalo comedy kuda ee range lo untada
— Rakesh Reddy (@Rakhi_IN) November 14, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mega Family, Sai Dharam Tej, Tollywood, Tollywood news