హోమ్ /వార్తలు /సినిమా /

Ravi teja Accident: హీరో రవితేజకు ప్రమాదం! టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్

Ravi teja Accident: హీరో రవితేజకు ప్రమాదం! టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్

Photo Twitter

Photo Twitter

Tiger Nageshwara Rao Shooting: జయాపజయాలను లెక్కచేయకుండా కథ నచ్చితే సినిమా చేస్తూ పోతున్నారు రవితేజ. ఈ నేపథ్యంలో తాజాగా రవితేజకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తుండటం అభిమానులను కంగారు పెడుతోంది. టైగర్ నాగేశ్వరరావు సినిమా షూటింగ్ చేస్తుండగా రవితేజకు ప్రమాదం జరిగిందని సమాచారం.

ఇంకా చదవండి ...

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) ప్రస్తుతం సూపర్ స్పీడ్‌గా సినిమాలు చేస్తున్నారు. చేతినిండా సినిమాలతో బిజీ బిజీ అయ్యారు. అయిదు పదుల వయసు దాటినా యంగ్‌ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ ముందుకెళ్తున్నారు. జయాపజయాలను లెక్కచేయకుండా కథ నచ్చితే సినిమా చేస్తూ పోతున్నారు రవితేజ. ఈ నేపథ్యంలో తాజాగా రవితేజకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తుండటం అభిమానులను కంగారు పెడుతోంది. టైగర్ నాగేశ్వరరావు సినిమా (Tiger Nageshwara Rao Shooting) షూటింగ్ చేస్తుండగా రవితేజకు ప్రమాదం (Ravi Teja Accident) జరిగిందని సమాచారం.

రవితేజ ప్రస్తుతం ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వర రావు’, 'ధమాకా' సినిమాల్లో నటిస్తున్నారు. ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్ర షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. స్టువర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో రోప్ స్కిడ్ కావడంతో రవితేజకు గాయాలయ్యాయని తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగి ఇప్పటికే రెండు రోజులైందని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని బయటకు తెలియకుండా చిత్రయూనిట్ జాగ్రత్త పడిందనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈ ప్రమాదం జరిగిన వెంటనే రవితేజను ఆసుపత్రికి తరలించారట. ఆయనకు 10 కుట్లు కూడా పడ్డాయని పెద్ద ఎత్తున వార్తలు షికారు చేస్తున్నాయి. ఇంత జరిగినా కూడా విశ్రాంతి తీసుకోకుండా రవితేజ షూటింగ్‌కు హాజరవుతున్నారట. సినిమాలోని యాక్షన్ సీన్స్‌ షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారట. స్టంట్ మాస్టర్ పీటల్ హెయిన్స్ డేట్స్ ఎక్కువగా అందుబాటులో లేకపోవడంతో.. ఇప్పుడే యాక్షన్ సీన్స్‌ను పూర్తి చేయాలని రవితేజ డిసైడ్ అయ్యారట. దీంతో డెడికేషన్ అంటే రవితేజది అందుకే ఇప్పటికీ ఆయన క్రేజ్ ఇంచు కూడా తగ్గలే అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

1970ల నేపథ్యంలో సాగే ఈ మూవీలో ఇప్పటివరకూ ప్రేక్షకులు చూడని గెటప్‌లో రవితేజ కనిపించనున్నారు. ‘దొంగాట’ ఫేం వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇదిలా ఉంటే రవితేజ హీరోగా తెరకెక్కి విడుదలకు సిద్ధంగా ఉంది రామారావు ఆన్ డ్యూటీ మూవీ. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.

First published:

Tags: Accident, Ravi Teja, Tollywood

ఉత్తమ కథలు