Hero Ram Pothineni Thanks to Heroine Anupama Parameswaran
Ram pothineni - Anupama Parameswaran: రామ్ హీరోగా నటించిన రెడ్ సినిమా మలయాళంలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌కు రామ్ థాంక్స్ చెప్పాడు.. కారణమేంటంటే..
ఉప్మా పాపకు థాంక్స్ చెప్పారు టాలీవుడ్ ఉస్తాద్. ఇంతకీ ఉస్తాద్ అంటే రామే కదా... అని అనుకుంటున్నారా? ఇంకా డౌట్లు, అనుమానాలు ఎందుకు? ఉస్తాద్ అంటే రామ్‌కి లేటెస్ట్ బిరుదు. మొన్న మొన్నటిదాకా మూవీ టైటిల్స్ లో రామ్ పేరుకు ముందు ఎనర్జిటిక్ స్టార్ అని పడేది. కానీ ఇప్పుడు మాత్రం ఆయన పేరుకు ముందు ఉస్తాద్ అని పడుతోంది. దీనికి రీజన్ పూరి జగన్నాథే. ఆయన తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ తర్వాత కాన్ఫిడెన్స్ లెవల్స్ పెరగడంతో రామ్ ఇప్పుడు ఉస్తాద్ అయ్యారన్నమాట. ఇంతకీ ఉస్తాద్ ఉన్నట్టుండి ఉప్మా పాపకు థాంక్స్ ఎందుకు చెప్పారు?
ఇంతకీ ఉప్మా పాప అంటే ఎవరో అనుకునేరు. అనుపమ పరమేశ్వరన్‌ను రామ్ ముద్దుగా ఉప్మాపాపా అని అంటారు. అది సరే... థాంక్స్ సంగతి ఏంటి? అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాను. రామ్ తన ట్విట్టర్లో అనుపమకి థాంక్స్ చెప్పడానికి మంచి రీజన్ ఉంది. ఈ నెల 17న అంటే ఆదివారం సాయంత్రం తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో రెడ్ సినిమా మలయాళ వెర్షన్ టీజర్‌ని రిలీజ్ చేయనుంది అనుపమ. అల్లు అర్జున్ మలబారు మార్కెట్ మీద కన్నేసినప్పుడు ఆయన్ని సపోర్ట్ చేయడానికి అక్కడ స్పెషల్‌గా హీరోయిన్లు ఎవరూ లేరు. కానీ ఇప్పుడు రామ్ పరిస్థితి అది కాదు. ఆల్రెడీ ఆయనకు పబ్లిసిటీ ఇన్చార్జ్ పోస్టును అనుపమ తీసుకున్నారు.
రామ్ నటించిన రెడ్ సినిమా మలయాళ వెర్షన్ ట్రైలర్‌ని రిలీజ్ చేయడం మాత్రమే కాదు, ఈ సినిమా ఈ నెల 22న విడుదలవుతుందని కూడా అనౌన్స్ చేసేశారు. మరోవైపు తెలుగులో రెడ్‌కి మంచి స్పందన వస్తోంది. శనివారం రాత్రి వైజాగ్‌లో బ్లాక్ బస్టర్ ఫంక్షన్‌ని సెలబ్రేట్ చేసుకున్నారు యూనిట్.
Published by:Anil
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.