హోమ్ /వార్తలు /సినిమా /

Ram Charan: శంకర్‌తో పాటు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిన మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ..అనౌన్స్‌మెంట్‌ ఎప్పుడంటే?

Ram Charan: శంకర్‌తో పాటు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిన మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ..అనౌన్స్‌మెంట్‌ ఎప్పుడంటే?

Ram Charan: మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ డైరెక్టర్‌ శంకర్‌తో పాటు మరో డైరెక్టర్‌తో సినిమా చేయడానికి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చాడని సినీ ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో తెలుసా..?

  మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్.. వినయ విధేయ రామ తర్వాత మరో సినిమా చేయలేదు. ఈ సినిమా విడుదలై రెండున్నరేళ్లు అవుతుంది. దీంతో మెగాభిమానులు, రామ్‌చరణ్‌ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం స్టార్‌ డైరెక్టర్‌ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ముగియగానే మరో అగ్ర దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో సినిమా చేయడానికి రామ్‌చరణ్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. తాజా సమాచారంతో పాటు మరో భారీ చిత్రానికి రామ్‌చరణ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడనే వార్తలు నెట్టింట హల్‌ చల్‌ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే రామ్‌ చరణ్‌ హీరోగా జెర్సీ దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడట. తెలుగు నిర్మాత ఈ సినిమాను నిర్మిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న ఈ సినిమాను అనౌన్స్‌ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీలో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

  తెలుగులో నానితో 'జెర్సీ' సినిమాను తెరకెక్కించిన గౌతమ్‌ తిన్ననూరి ఇటు ప్రేక్షకుల అభినందనలతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా సంపాదించుకున్నాడు. దీంతో షాహిద్‌ కపూర్‌ హీరోగా జెర్సీ రీమేక్‌ను హిందీలో తెరకెక్కించే అవకాశం దక్కింది. జెర్సీ హిందీ సినిమా కూడా విడుదలవుతుంది. ఇది పూర్తయిన వెంటనే రామ్‌చరణ్‌ సినిమాను గౌతమ్‌ తిన్ననూరి ట్రాక్‌ ఎక్కిస్తాడు. మరో వైపు రామ్‌చరణ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. మార్చి వరకు ట్రిపుల్‌ ఆర్‌ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత శంకర్‌ దర్శకత్వంలో నెక్ట్స్‌ మూవీని స్టార్ట్‌ చేస్తాడని టాక్‌ వినిపిస్తోంది.

  ఇండియన్‌ 2 సినిమా ఆగిపోవడంతో డైరెక్టర్‌ శంకర్‌ .. రామ్‌చరణ్‌తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. దిల్‌రాజు, శిరీష్‌ నిర్మాతలుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ సినిమాను ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా చకచకా జరుగుతున్నాయి. భారీ తనం, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో సినిమాను తెరకెక్కించే శంకర్‌ తన సినిమాలో రామ్‌చరణ్‌ను ఎలా చూపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

  First published:

  Tags: Ram Charan, Shankar

  ఉత్తమ కథలు