‘మా’లో మళ్లీ గొడవలు... నరేష్, రాజశేఖర్ మధ్య వివాదం

నిన్నరాత్రి 11 గంటలకు మా కార్యవర్గ సభ్యులు సమావేశం అయ్యారు. నరేష్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు సభ్యులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: September 11, 2019, 12:30 PM IST
‘మా’లో మళ్లీ గొడవలు... నరేష్, రాజశేఖర్ మధ్య వివాదం
‘మా’ అధ్యక్షుడు నరేష్‌తో జీవితా రాజశేఖర్
  • Share this:
మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ (మా)లో మళ్లీ గొడవలు మొదలయ్యాయి. మా అధ్యక్షుడు నరేష్, ఉపాధ్యక్షుడు రాజశేఖర్ మధ్య వివాదం నెలకొంది. దీంతో నరేష్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు రాజశేఖర్ సిద్ధమయ్యారు. మాలో కొత్త బాడీ ఏర్పాటు  అయి ఆరు నెలల కావస్తోంది. కానీ ఇప్పటివరకు మాలో ఎలాంటి ఫండ్స్ కలెక్ట్ చేయలేదు. చాలా రోజుల నుంచి నరేష్ మా మీటింగ్స్‌కు రావడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎప్పుడూ ఏవో పనులు ఉన్నాయంటూ ఆయన మా సమావేశాలకు హాజరుకావడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో నిన్నరాత్రి 11 గంటలకు మా కార్యవర్గ సభ్యులు సమావేశం అయ్యారు. నరేష్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు సభ్యులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఫండ్ కలెక్షన్ కోసం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నదానిపై కూడా చర్చలు జరిపారు.

అయితే నరేష్ మాత్రం సమావేశంకు సంబందించి తనకు ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నారు. అయితే మాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్దలు కల్పించుకొని సమస్యను చక్కదిద్ద ప్రయత్నాలు చేస్తే బావుంటుందని పలువురు భావిస్తున్నారు. అయితే అధికారం కోసం ఇలా మా సభ్యులు మధ్య కుమ్ములాటలు, కొట్లాటలు సరికాదంటున్నాయి సినీ వర్గాలు. సమావేశం పెట్టుకొని సమస్యను సామరస్యంగా చర్చించుకోవాలని కోరుతున్నారు.

First published: September 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు