హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు.. ఆర్టీఏ సంచలన నిర్ణయం..

రీసెంట్‌గా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై పరిమితికి మించిన వేగంతో కారు నడపడంతో హీరో రాజశేఖర్ కారు అదుపు తప్పి మూడు పల్టీలు కొట్టిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఆయన డ్రైవింగ్ లైసెన్స్ ఆర్టీఏ రద్దు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

news18-telugu
Updated: November 29, 2019, 9:44 AM IST
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు.. ఆర్టీఏ సంచలన నిర్ణయం..
రాజశేఖర్ ఫైల్ ఫోటో
  • Share this:
రీసెంట్‌గా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై పరిమితికి మించిన వేగంతో కారు నడపడంతో హీరో రాజశేఖర్ కారు అదుపు తప్పి మూడు పల్టీలు కొట్టిన సంగతి తెలిసిందే కదా.  సమయానికి ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో రాజశేఖర్  పెను ప్రమాదం తప్పింది. ఓఆర్ఆర్ పై రాష్ డ్రైవింగ్ చేసిన కారణంగా ఆయన డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలని సైబరాబాద్ పోలీసులు  ఆర్టీఏ వాళ్లకు లేఖ రాసారు. దీంతో మరికొన్ని రోజుల్లో రాజశేఖర్ కారు లైసెన్స్ రద్దు కానుంది. ఇప్పటికే హీరో రాజశేఖర్ ట్రాఫిక్ నిబంధలను పలు మార్లు ఉల్లఘించిన నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంతో రాజశేఖర్ 2017 అక్టోబర్ 9న  కారు ప్రమాదానికి గురైంది. ఆ రోజు రాత్రి పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఒక వ్యక్తి కారుని తన కారుతో ఢీ కొట్టారు. రాజశేఖర్ ఆ  రోజు తాగి  డ్రైవ్ చేసినట్టు  బాధితులు ఫిర్యాదు చేసారు. ఆ సమయంలో పోలీసులు డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు చేయగా ..ఆయన తాగలేదని ప్రూవ్ అయింది.ఆ యాక్సిడెంట్ గరుడ వేగ సినిమా రిలీజ్‌కు కొన్ని ముందు జరిగింది.

 


 

First published: November 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>