ఆ మధ్య హైదరాబాద్ శివారులో ప్రభుత్వ స్థలంలో ప్రభాస్..గెస్ట్ హౌస్ అక్రమంగా నిర్మించాడని తెలంగాణ ప్రభుత్వ అధికారులు.. ప్రభాస్‌కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలసిందే కదా. ఆ విషయమై ప్రభాస్ హై కోర్టు మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే కదా. ఇపుడీ కేసు పెండింగ్‌లో ఉంది. ఆ కేసు మరిచిపోకముందే ప్రభాస్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి మాత్రం ప్రభాస్.. తన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమా విషయంలో వార్తల్లో నిలవడం గమనార్హం. 2011లో ప్రభాస్ హీరోగా దశరథ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమా తెరకెక్కింది. కాజల్ అగర్వాల్, తాప్సీ హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఐతే ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమా కథ నాదే అంటూ ప్రముఖ రచయిత్రి శ్యామలా రాణి కోర్టు మెట్లు ఎక్కింది. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ స్టోరీ.. ఆమె రచించిన ‘నా మనసు నిన్ను కోరే’ కథను దొంగలించే ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమా తీశారని ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై అప్పట్లో కోర్టు ఆదేశాలతో మాదాపూర్ పోలీసులు నిర్మాత దిల్ రాజుకు సమన్లు కూడా పంపారు.
తాజాగా ప్రభాస్ హీరోగా నటించిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ కథ శ్యామలా దేవి రచించిన ‘నా మనసు నిన్నుకోరే కథ’ దాదాపు ఒకేలా ఉన్నాయని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నిర్ధారించినట్టు సమాచారం. ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోర్టు ఆదేశించినట్టు సమాచారం. ఈ విషయమై రచయిత్రి శ్యామలా రాణి మాట్లాడుతూ..కోర్టులో ఈ విషయాన్ని తెేల్చుకోవాలనే కోరిక తనకు లేదన్నారు. ఈ విషయమై నిర్మాత దిల్రాజును పలుమార్లు సంప్రదించాలని ప్రయత్నించినా ఆయన నుంచి స్పందన కరువైంది. దీంతో చేసేదేమి లేక నేను కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు.
ఇక మిస్టర్ పర్ఫెక్ట్ స్టోరీ విషయంలో 2017లోనే దర్శకుడు దశరథ్ మాట్లాడుతూ.. శ్యామలా రాణి నవల 2010లో అచ్చు అయింది. కానీ నేను ఈ స్టోరీని 2009 ఫిబ్రవరిలోనే ‘నవ్వుతో’ టైటిల్‌తో సినీ రచయితల సంఘంలో నమోదు చేయించాను. నేను దీనికి సంబంధించిన ఆధారాలన్ని కోర్టుకు సమర్పించాను కూడా. 2008లో ప్రభాస్..‘బిల్లా’ షూటింగ్లో మలేషియాలో ఉన్నపుడు నేను, దిల్‌రాజుతో కలిసి వెళ్లి ‘మిస్టర్ పర్ఫెక్ట్’ కథను నేరేట్ చేసాం. ఆ సినిమా కాపీ కథ అనడంలో అర్థం లేదు. ఆమె నవల కన్నా ముందే నా కథ ఉందంటూ దశరథ్ వివరణ ఇచ్చకున్నాడు. మొత్తానికి ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: #Prabhas20, Bahubali, Dil raju, High Court, Prabhas, Prabhas Latest News, Saaho