news18-telugu
Updated: December 5, 2019, 7:51 AM IST
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Twitter/Photo)
అవును యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఘోర అవమానం జరిగింది. అది కూడా యాహూ సెర్చ్ ఇంజిన్ సాక్షిగా.. వివరాల్లోకి వెళితే.. వాల్డ్ వైడ్‌గా భారతీయ సినిమా అంటే హిందీ సినిమాల పేర్లే చెప్పేవారు. ముఖ్యంగా మన దేశంలో హిందీ సినిమాలదే ఆధిపత్యం. అంతేకాదు ఇంటర్నేషనల్ లెవల్లో హిందీ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లు, అక్కడి హీరోల క్రేజ్‌తో బాలీవుడ్ ఆధిపత్యం కొనసాగుతూ వచ్చింది. కానీ ఎపుడైతే.. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా విడుదలైందో అప్పటి నుంచే భారతీయ చిత్ర పరిశ్రమలో బాక్సాఫీస్ లెక్కలన్ని మారిపోయాయి. బాహుబలి సిరీస్‌లో వచ్చిన బాహుబలి 2 కూడా ఏ హిందీ సినిమా కూడా కలలో కూడా ఊహించిన కలెక్షన్లు రాబట్టి ఔరా అనిపించింది. మన దేశంలో ఒక రీజనల్ సినిమాకు ఇంత సత్తా ఉందా అని అందరిని అవాక్కయ్యేలా చేసింది. దేశ వ్యాప్తంగా కలెక్షన్ల సునామి సృష్టించిన ‘బాహుబలి’ సినిమాను యాహూ ఇండియా గుర్తించకుండా తీవ్ర అవమానానికి గురి చేసిందని తెలుగు సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు. మరోవైపు ‘బాహుబలి’ సినిమా తర్వాత ‘సాహో’ తో పలకరించిన ప్రభాస్‌ను కూడా పరగణలోకి తీసుకోకపోవడాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.

బాహుబలి పోస్టర్.. Photo: Twiiter
యాహూ ఇండియా ఆమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’ సినిమాను బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆప్ డికేడ్‌గా నిర్ణయించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను రూ.2 వేల కోట్ల కలెక్షన్లను సాధించింది. చైనాలో రిలీజైంది కాబట్టి ఈ రేర్ ఫీట్ సాధించింది. కానీ బాహుబలి మాత్రం కేవలం ఇండియన్, ఓవర్సీస్ మార్కెట్‌ను కలుపుకొని రూ.1800 కోట్లకు పైగా వసూళ్లను కలెక్ట్ చేసింది. ఇక యాహూ ఇండియా పోటీలో తీసుకున్న టాప్ పది చిత్రాల్లో ‘బాహుబలి’ కి స్థానం కల్పించలేదు. యాహూ కావాలనే బాహుబలిని పక్కన పెట్టిందా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు వీళ్ల దృష్టిలో తెలుగు సినిమాలంటే లెక్కే లేదా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఏమైనా యాహూ ఇండియా ఏ ప్రాతిపదికన బాహుబలిని ఎంపిక చేయలేదో చెబితే బాగుంటుందిని అందరు చెప్పుకుంటున్నారు.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
December 5, 2019, 7:51 AM IST